ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా ‘సర్కారువారి పాట’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే సంక్రాంతి బరిలో పోటీపడబోతున్న పందెం కోళ్ళ విషయంలో నిదానంగా క్లారిటీ వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ యేడాది విడుదల కావాల్సిన ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే యేడాది జనవరి 13న విడుదల కావాల్సింది. కానీ ఎప్పుడైతే రాజమౌళి తన మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను ఈ యేడాది చివరిలో కాకుండా, వచ్చే జనవరి 26న కాకుండా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తానని ప్రకటించాడో, మిగిలిన సినిమాల డేట్స్ మారే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేశారు. అయితే, జనవరి 12న వస్తానంటున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, జనవరి 14న రావాల్సి ఉన్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాల విడుదల తేదీలో మాత్రం మార్పు లేదని ‘ట్రిపుల్ ఆర్’ మూవీ విడుదల తేదీ ప్రకటించిన తర్వాత కూడా నిర్మాతలు తెలిపారు. కానీ దీనికి నెల రోజుల పైనే సమయం ఉంది కాబట్టి, ఈ రెండు సినిమాలలో ఏదైనా వాయిదా పడుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేం.
విశేషం ఏమంటే, ‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ కు ఒకరోజు ముందే, ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన అలియాభట్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదల కానుంది, ఆ సినిమాలో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషించిన అజయ్ దేవ్ గన్ సైతం నటించాడు. మరి ఈ ఇద్దరూ నటించిన ‘గంగూబాయి’ చిత్రం కూడా వాయిదా పడుతుందేమో చూడాలి. ఏదేమైనా… ఏప్రిల్ 1వ తేదీన తమ ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రిన్స్ మహేశ్ ఈ రోజు అధికారికంగా ప్రకటించడం విశేషం. ఎందుకంటే ఏప్రిల్ మాసం అనగానే మహేశ్ అభిమానులందరికీ బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’గుర్తొస్తుంది. సో… అలాంటి కెరీర్ హిట్ ను ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా ఇస్తుందేమో చూడాలి.
Also Read
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్‌లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!