దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా.. బంగారం ధరలు పెరుగుతుండటంతో… పుత్తడిని కొనుగోలు చేయాలంటే… ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,760 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు. గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా […]
నాలుగేళ్ళ క్రితం తమిళంలో రూపుదిద్దుకుని, కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘విక్రమ వేద’ మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ హిందీ వెర్షన్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి ద్వయం హిందీ రీమేక్ నూ డైరెక్ట్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను అబు దబీ లో పూర్తిచేశారు. అక్కడ దాదాపు […]
ప్రముఖ నటుడు విశాల్ నటించిన ‘తుప్పరివాలన్’ చిత్రం తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో డబ్ అయ్యింది. 2017లో విడుదలైన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దీనికి సీక్వెల్ చేయాలని అప్పట్లోనే విశాల్ భావించాడు. అయితే దర్శకుడు మిస్కిన్ తో వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సీక్వెల్ అనుకున్న సమయానికి పట్టాలెక్కలేకపోయింది. దాంతో ‘తుప్పరివాలన్ -2’ కు తానే డైరెక్షన్ చేయాలనే నిర్ణయానికి విశాల్ వచ్చేశాడు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ […]
దీపక్ దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసానమః’ 2022 ఆస్కార్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో క్వాలిఫై అయ్యింది. త్వరలో జరిగే ఓటింగ్ తో నామినేషన్ సైతం దక్కించుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ‘మనసానమః’ లఘు చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో మీడియాకు ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం దర్శకుడు దీపక్ మాట్లాడుతూ, ”కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్ […]
టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని […]
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మన దేశంలో థర్డ్ వేవ్‌కి దారితీస్తుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే పదిహేడు కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన రాంచీకి చెందిన 37 ఏళ్ల వ్యక్తి కొత్త మహమ్మారి బారిపడ్డాడు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ అతనికి ఒమైక్రాన్ సోకింది. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. జైపూర్‌లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. […]
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ […]
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. సమంత నటనకు వీక్షకులు సహా, విమర్శకులు సైతం ఫిదా అయిపోయారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో సమంత చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ […]