లీడర్స్ ఫర్ సేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారనే ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఎవరు బాగోతం ఏంటో తెలుసుకునేందుకు.. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షలకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్..! ఎన్నికలంటేనే.. బోల్డంత డబ్బు ఖర్చుపెట్టాలి. ఓటర్లకు పంచడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు నోట్ల కట్టలతో కొడతారు. దీపం […]
ఒక్క జిల్లా.. రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. ఐదుగురు మంత్రులు. ఇది అధికారపార్టీ రచించిన పంచతంత్రం. ఎందుకు అక్కడంత ప్రత్యేకత? స్పెషల్ ఫోకస్ వెనక కారణం.. రెబల్ అభ్యర్థికి చెక్ పెట్టడమేనా? కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేదెవరు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారపార్టీ నుంచి స్పెషల్ క్యాంపులు జోరు పెరిగింది. పోలింగ్ జరిగే ఆరింటిలో కరీంనగర్‌లో జరిగే రెండు స్థానాలపైనే పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ […]
జగన్ సర్కార్ పై సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. పోలవరానికి కేంద్రం నిధులివ్వడం లేదని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. అంచనాలు పెంచేశారని చంద్రబాబు పై విమర్శలు చేసిన ఇదే సీఎం జగన్.. ఇప్పుడు అవే అంచనాల ప్రకారం నిధులివ్వాలని ఎలా అడుగుతారు..? అని నిలదీశారు. పోలవరం కట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాకుంటే కేంద్రానికి అప్పగించాలని సవాల్ విసిరారు. పోలవరం నిమిత్తం ఇప్పటి వరకు రూ. 11 వేల కోట్లు ఇచ్చామని… మరో […]
జగన్ సర్కార్ పై టీడీపీ యువ నేత నారా లోకేష్ మరోమారు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు నారా లోకేష్. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే.. సీఎం జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందంటూ చురకలు అంటించారు. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని… 12 గ్రామాలు నీట మునిగాయి, రూ.1721 కోట్ల […]
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో తెలంగాణ సర్కార్ మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గతేడాది మాస్క్ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల […]
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,822 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 95,014కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 220 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్‌లో ఇప్పటి […]
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరీంగ్ కేసులో ఈనెల 8న ఢిల్లీలో… తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ… ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య, నటి లీనా మరియా పాల్‌తో పాటు మరో ఆరుగురి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. చంద్రశేఖర్.. జాక్వెలిన్‌కు విలువైన బహుమతులు ఇచ్చినట్టు గుర్తించి…ఆమెను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఈడీ అధికారులు. ఈ […]
శిల్ప కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిట్టి పార్టీల కోసం దివానోస్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. దివానోస్ క్లబ్‌లో 90 మందిని చేర్చారు. పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎర వేశారు. ఆమె ఆఫర్లను నమ్మి బ్లాక్ మనీని శిల్ప చేతిలో పెట్టారు కొందరు వ్యాపారవేత్తలు. మరోవైపు…శిల్ప కేసులో మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. షామీర్‌పేటకు […]
హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు… కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని సూచించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె చేసి తీరుతామని […]
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు […]