సోనియాగాంధీకి రోశయ్య అత్యంత ఆప్తుడని… రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కాసేపటి క్రితమే రోశయ్య పార్థివదేహానికి మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ.. రోశయ్యతో నాకు మంచి సాన్నిహిత్యం ఉందని… కాంగ్రెస్ లో జాయిన్ అయిన దగ్గర నుండి అనేక పదవులకు వన్నెతెచ్చారని కొనియాడారు. రోశయ్యకి నివాళి అర్పించడం కోసం ఏఐసిసి అధ్యక్షులు సోనియాగాంధీ నన్ను ఇక్కడికి పంపించారన్నారు. ఎలాంటి కాంట్రవర్సీ లేని నాయకుడు రోశయ్య అని… అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం […]
న్యూయార్క్‌ను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ నగరం ఎంతలా అతలాకుతలమైందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో మరోసారి ఆ నగరాన్ని కరోనా భయపెడుతున్నది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమైన ఒమిక్రాన్ న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు న్యూయార్క్‌లో 8 కేసులు నమోదయ్యాయి. Read: వీడని ఒమిక్రాన్ భయం… ఆ గుట్టు బయటపడేదెప్పుడు… నగరంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని న్యూయార్క్ […]
చంద్రబాబు, సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారాడు…ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ ముఖ్యమంత్రి గా తయారయ్యారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని ఆగ్రహించారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాన్ని పంచ తీర్ధాలు […]
ఒమిక్రాన్ వ్యాప్తి కొనసాగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. వచ్చే వారం నుంచి ఈ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి.అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించున్న కొవిడ్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో నెగెటివ్ వచ్చినట్టు ప్రయాణికులు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. ఇది అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ వర్తిస్తుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.ప్రజారవాణా, పబ్లిక్ స్థలాల్లో మాస్కు […]
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఇప్పటికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ 38 దేశాలకు పాకేసిందని నిపుణుల చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మన దేశంలోనూ ఈ వేరియంట్ ప్రవేశించింది. ఇప్పటికే భారత్‌లో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య 5 కు చేరుకుంది. తాజాగా ఢిల్లీలో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అతన్ని ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించి… […]
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో సామాన్య పౌరులను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గుగనిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న కార్మికులను చూసి […]
చిన్న చిన్నవిషయాలకు మసస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూర నచ్చలేదని, నచ్చిన వస్తువు కొనివ్వలేదని ఇలా చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలానే భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అంబర్‌పేట్‌లో జరిగింది. అంబర్‌పేటలో శ్రీనివాసులు, టి విజయలక్ష్మీలు గోల్నాక తిరుమలనగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త శ్రీనివాస్ ద్విచక్రవాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. Read: వైరల్: రన్‌వేపై విమానం […]
ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 8,895 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 2796 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 473,326 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 99,155 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది […]