ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు : సజ్జల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబుకు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని ఫైర్ అయ్యారు సజ్జల. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. ఓటీఎస్ పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమనాలో వారే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు. ఓటీఎస్ పథకంలో పేదలకు నష్టం కల్గించేది అంటూ ఏదీ లేదని…చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ మాఫీ కూడా చేయలేదని ఫైర్ అయ్యారు.
ఓటీఎస్ తో క్రయ విక్రయాలకు అవకాశం కల్గడం, వారసులకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కలుగుతుందన్నారు. పదేళ్లు తర్వాత పట్టా చేసే అవకాశాన్ని ప్రభుత్వం చట్ట సవరణ చేసిందని తెలిపారు. ఓటీఎస్ తో ప్రభుత్వానికి వచ్చేది కేవలం 4వేల కోట్లేనని… పంచాయతీల్లో రిజిస్ట్రేషన్లకు ఇంటికి 10 వేలకు, మున్సి పాల్టీలో 15వేలు, కార్పోరేషన్లలో 20 వేలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఓటీఎస్ పూర్తిగా స్వచ్చందమని… ఎవరినీ బలవంత పెట్టడం లేదని వెల్లడించారు. ఓటీఎస్ పై విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు కు లేదని.. అన్ని ఉచితంగా చేస్తే ఉచితం అంటూ దుష్ర్పచారం చేస్తారని మండిపడ్డారు. పేదల నోటి కాడిది తీసేయవద్దని తెదేపాను, చంద్రబాబును కోరుతున్నానని పేర్కొన్నారు సజ్జల.
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!