ఇవాళ ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయవాడ ఏపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమంలో సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాకే శైలజానాధ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని మండిపడ్డారు. మోడీ పబ్లిసిటీ పిచ్చికి.. నేడు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని.. ప్రజలపై పోటీలు పడి భారాలు […]
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్బంగా హన్మంతరావు మాట్లాడారు. కరోనాతో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వబోడని…సమస్యలపైన సీఎంకు ఎన్ని లేఖలు రాసిన స్పందన లేదని ఫైర్ […]
తెలంగాణ రాజకీయాలు వేడివాడిగా సాగుతున్నాయి. ఈటల నెక్స్ట్ ఎలాంటి అడుగు వేస్తారని సమస్త తెలంగాణ ప్రజల్లో ఓ ప్రశ్న మెదులుతోంది. మొన్నటి వరకు సొంత పార్టీకే ఓటు వేసిన.. ఈటల రాజేందర్ BJPలో చేరడానికే మొగ్గు చూపుతున్నారు. ఇందుకు గాను జూన్ 6 వ తేదీ ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా,నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. జూన్ 2 న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ […]
ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టీడీసీ ఎం.డిగా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ […]
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో @askktr పేరుతో ప్రజల సమస్యలను మంత్రి కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజలకే కాకుండా.. ఇతర రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతోంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ చేస్తున్న పనికి ఎంతో మంది నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు ట్విటర్ వేదికగా తోటకూర […]
ఆనందయ్య మందు పంపిణీకి అనుమతులు రావడం లాంఛనంగా కనిపిస్తున్నాయి. తాజాగా సిసిఆర్ఏఏస్ కి విజయవాడ పరిశోధన కేంద్రం సానుకూల నివేదిక పంపింది. విజయవాడ, తిరుపతి కేంద్రంగా 570 మంది శాంపిల్స్ సేకరించిన పరిశోధకులు.. ఆనందయ్య మందు స్వీకరించిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ నివేదిక పంపారు పరిశోధకులు. ఆనందయ్య మందుకు అనుమతులు వస్తే…. మందు పంపిణీ చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. రోజుకి లక్ష మందికి మందు పంపిణీ తయ్యారు చేసేందుకు పదార్థాల సేకరణలో ఆనందయ్య […]
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి […]
ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేసింది ఏపీ హోంశాఖ. సామినేని ఉదయభాను నిందితుడిగా ఉన్న 10 క్రిమినల్ కేసుల్ని ఎత్తేసింది రాష్ట్ర హోంశాఖ. డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్. 10 కేసులపై ప్రస్తుతం విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో కొనసాగుతున్న విచారణ… ఆ పది కేసుల్లో విచారణను ఉపసంహరించుకుంటూ పిటిషన్ దాఖలు చేయించేందుకు చర్యలకు […]
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమ్మర్‌లో కరోనా కేసులతో పాటుగా బంగారం ధరలు కూడా పెరగడం మొదలుపెట్టాయి. అయితే ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 తగ్గి రూ. 49,860కి చేరింది. దేశీయంగా అనేక […]