ఇవాళ ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. విజయవాడ ఏపిసిసి భవన్ లో నిరసన కార్యక్రమంలో సాకే శైలజానాధ్, నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాకే శైలజానాధ్ మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారని మండిపడ్డారు. మోడీ పబ్లిసిటీ పిచ్చికి.. నేడు ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని.. ప్రజలపై పోటీలు పడి భారాలు పెంచుతున్నారన్నారు. పేదలకు కరోనా సమయంలో పది వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని.. సిఎం జగన్ కూడా మోడీ బాటలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ధరలను అదుపు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని..జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఆదర్శంగా ఉందని చెప్పడం అబద్దమని పేర్కొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.