ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.భాస్కర్ ను కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా అదనపు బాధ్యత ఇసస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టీడీసీ ఎం.డిగా బాధ్యతలు చూస్తున్న ప్రవీణ్ కుమార్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి ఎస్. సత్యనారాయణకు ఏపీటీడీసీ ఎమ్.డిగా బాధ్యతలు అప్పగించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్ అధికారి పి. బసంత్ కుమార్ కు మున్సిపల్ అండ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్ఐజీ హౌసింగ్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీంతో పాటు ఏపీయుఎఫ్ఐడీసీ ఎమ్.డి. అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.