తెలంగాణ సిఎం కెసిఆర్ కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ […]
దేశ రాజధానిలో “లాక్ డౌన్” మరో వారం పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. దీంతో ఢిల్లీలో జూన్ 7వ తేదీ వరకు “లాక్ డౌన్” కొనసాగనుంది. అయితే, కొన్ని షరతులతో ఉత్పత్తి, నిర్మాణ రంగ వ్యాపారాలు పునఃప్రారంభానికి అనుమతులు ఇచ్చింది సర్కార్. తిరిగి పనులు ప్రారంభించే వ్యాపార సంస్థలు చాలా ఖచ్చితంగా “కరోనా” నిబంధనలు పాటించాలని..ఉద్యోగులు ఒకేసారి సమూహంగా విధుల్లోకి రాకుండా, పలు షిప్టులలో పనిచేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆయా […]
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం. […]
మేషం : ఈ రోజు మీ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పట్ల ఉదార వైఖరిని కలిగి ఉంటారు. వారికి డబ్బు కూడా ఖర్చు పెడతారు. వృషభం : ఈ […]
గతఐదు రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అనుకున్న వినియోగదారులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుండటం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. 10 గ్రాముల […]
విమాన ప్రయాణికులకు షాక్ తగిలింది. దేశీయ విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. విమానయాన ఛార్జీల దిగువ పరిమితిని జూన్ 1 నుంచి 13-16 శాతం పెంచుతూ పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఉత్తర్వుల మేరకు.. 40 నిమిషాల విమాన ప్రయాణానికి ఛార్జీల దిగువ పరిమితి రూ.2,300 నుంచి రూ.2,600లకు పెరుగగా, 40-60 నిమిషాల ప్రయాణానికి దిగువ పరిమితి ఛార్జీ ప్రస్తుతం ఉన్న రూ. 2,900 నుంచి రూ.3,300కి పెంచింది. 60-90 నిమిషాల ప్రయాణానికి […]
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. చంద్రబాబుకు వయసు, టైమ్ అయిపోయిందని.. అందుకే జూమ్ లో కాలక్షేపం చేస్తున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. “గడియారం ముల్లుపై ఆశలు పెట్టుకుని జూమ్ లో కాలక్షేపం చేస్తుండు. శాశ్వతంగా అక్కడే మిగిలిపోతావు. కాలం పరుగులు పెడుతూనే ఉంటుంది. దానితో పోటీపడి పని చేస్తుంటాడు యువ సిఎం. నీకు వయసు మీద పడింది. టైమ్ అయిపోయింది. ముల్లు వెనక్కి తిరగదు.” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక […]
దేశంలో ప్రజల ఇబ్బందులకు ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని సిపిఐ రామకృష్ణ అన్నారు. కరోనా కంట్రోల్ చేసింది మోడీ వల్లే నంటూ గతంలో బిజెపి తీర్మానం చేసిందని..సెకండ్ వేవ్ లో వైఫల్యానికి మాత్రం మోడీ కారణం కాదంటారా ? అని ఫైర్ అయ్యారు. ఎన్నికలు నిర్వహణ, కుంభమేళా పెట్టడం వల్లేనని..దేశంలోనే యాభై శాతం కరోనా కేసులు నమోదయ్యాయని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలలో విజయమే ముఖ్యంగా మోడీ పని చేశారని..పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది సార్లు […]
కరోనా మొదలైనప్పటి నుంచి దాని నిర్ధారణ అనేక రకాలుగా టెస్టులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్, లేదా స్కానింగ్ పద్దతుల ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. అయితే పరీక్షలతో ఫలితాలు ఉన్నా అందరికీ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రులకు ఆర్టీపీసీఆర్ టెస్టుల మీదనే ఆధారపడుతున్నారు. మరోవైపు ఈ కితల కొరత కూడా వేదిస్తోంది. ఇక స్కానింగ్ ద్వారా కేవలం పట్టణాల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనాను నిర్ధారిచేందుకు మరో రకమైన […]