మేషం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయసలహా పొందుతారు. వృషభం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరువ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. […]
ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణ వైద్య శాఖ సీరియస్ అయింది. ఎన్టీవీలో వరుస కథనాలతో ఆస్పత్రులపై యాక్షన్ కు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. ప్రయివేట్ ఆస్పత్రులపై చర్యలకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 64 ఆస్పత్రులపై 88 నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. ఆస్పత్రులకు, వైద్యశాఖ అనుసంధానంగా ఉండి.. ఎక్కువ బిల్స్ వేస్తే తగ్గిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 4 కోట్లు […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ముంబైకి తరలించింది ఎన్సీబీ. సుశాంత్ ప్లాట్‌లో మూడేళ్లపాటు ఉన్న సిద్ధార్థ్.. డ్రగ్స్ కేసులో సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించింది ఎన్సీబీ. ఆత్మహత్యకు ముందు చివరి సారి సిద్ధార్థ్‌తో మాట్లాడారు సుశాంత్. సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గా కూడా సిద్ధార్థ్ పనిచేశారు. సిద్ధార్థ్ పితానిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న ముంబై NCB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుశాంత్ కేసులో […]
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 43 వ “వస్తు, సేవల పన్ను” మండలి ( జి.ఎస్.టి కౌన్సిల్) సమావేశం అయింది. సుమారు 7 నెలల తర్వాత సమావేశం జరిగింది. 2017 సంవత్సరం జులై నెల నుంచి GSTR (3B) రిటర్న్ ఫైల్ చేయడం ఆలస్యం అయితే, విధించే “లేటు ఫీజు”ను తగ్గించే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకొనేందుకు కొనుగోలు చేసే “ఆక్సిజన్ కాన్సంట్రేటర్”పై ఉన్న […]
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడిని అరికట్టేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్దంగా డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తే పది రెట్లు పెనాల్టీ విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రెండోసారి ఇదే తప్పిదానికి పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 50 లేదా అంతకు మించి పడకలున్న ఆస్పత్రులు తప్పని సరిగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు […]
లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో […]
టిడిపి నిర్వహిస్తున్న మహానాడుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని పెట్టుకో సరిపోతుందని ఎద్దేవా చేశారు. “వైఎస్సార్ పంటల బీమా పథకంపై పడి ఏడుస్తాడు. రైతు భరోసా కింద డబ్బులిస్తే కేంద్ర నిధులంటాడు. కేంద్ర నిధులైతే అన్ని రాష్ట్రాల్లో ఉండాలిగా చంద్రబాబూ? మహానాడులో అబద్ధాలు ప్రచారం చెయ్యడానికి సిగ్గులేదూ ? మహానాడు పేరు తీసేసి “నారా నేడు” లేదా “పప్పు డప్పు” అని […]
విశాఖ బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడుపల్లా శ్రీనివాస్, tnsf రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీని రంగం ద్వారా ఎన్టీఆర్ తెలుగు జాతికి మంచి పేరు తెచ్చారని..రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని […]
భారత్ లో రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు తగ్గినా.. “కరోనా” మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 1,86,364 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,660 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,59,459 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య […]