టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు పిల్లి శాపాలకు ఎవరు భయపడబోరని చరకలు అంటించారు విజయసాయిరెడ్డి. వచ్చే మహానాడు వరకు టిడిపి పార్టీ ఉంటుందో లేదో చూసుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు. “పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ. 2024 ఎన్నికల గురించి ఇప్పుడే జోస్యాలు చెబ్తున్నావు. వచ్చే మహానాడు వరకు నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో. మూడేళ్ల తర్వాత జగన్ గారి వెంట ఎవరూ మిగలరని శోకాలు […]
సీఎం జగన్ రెండేళ్ల పాలనపై జగన్ విధ్వంసం పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేసారు అచ్చెన్నాయుడు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జగన్ అధికారంలోకి వచ్చాక జేసీబి, ఏసీబీ, పీసీబీ, టాగ్ లైన్ సిఐడి అని చురకలు అంటించారు. సామాన్యుడు, మధ్య తరగతి ప్రజలు ఎవరైనా ఒక కార్యక్రమాన్ని మంచి పనితో మొదలు పెడతారు.. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం విధ్వంసంతో మొదలు పెడుతుందన్నారు. జేసీబీ-ప్రజా వేదికను కూల్చడంతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం ప్రారంభించారని.. ఏసీబీ-జగన్ పరిపాలన […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులు అని కొనియాడారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి రెండో టర్మ్ రెండేళ్లు పూర్తి చేసుకుంటే.. […]
మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు […]
సిఎం కెసిఆర్ జమున హేచరిస్ అధినేత ఈటెల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. తమపై నెల రోజుల నుండి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని.. వాటిని ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు అని ఫైర్ అయ్యారు. మేము ఏ రోజు కూడా తప్పు చేయలేదని..మసాయిపేట్ లో 46 ఎకరాలు కొన్నది వాస్తవమని..బడుగు, బలహీన వర్గాల నుంచి మేము భూములు తీసుకుంటామా? అని ప్రశ్నించారు. మేము కొన్న భూమి కన్నా ఒక్క ఎకరం ఎక్కువ ఉన్న ముక్కు నేలకు […]
చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత […]
భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,65,553 పాజిటివ్ కేసులు నమోదవగా.. 3,460 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2,76,309 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,25,972 మంది మరణించారు.. ఇక, రికవరీ కేసులు 2,54,54,320 కు పెరిగాయి. ప్రస్తుతం […]
సోషల్ మీడియాలో శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. “సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో పోస్టులు పెట్టడం…. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం…. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు […]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియన్సీ క్యారీ సైమండ్స్ ను జాన్సన్ పెళ్లి చేసుకున్నారు. శనివారం రోజున లండన్ లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ కార్యక్రమం ముగిసింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది. దీనిపై బోరిస్ జాన్సన్ అధికారిక కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మాట్లాడటానికి మీడియా నిరాకరించినట్లు మీడియా తెలిపింది. […]