అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు చంద్రబాబు లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ పార్టీ నేత తిక్కారెడ్డి పై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు చంద్రబాబు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని… వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంవో పోలీసులు విఫలం అవుతున్నారని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]
తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామ శివారులో సాయితేజకు సైనిక గౌరవవందనం నిర్వహించడానికి చిన్న మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో… కుటుంబ సభ్యుల DNA శాంపిళ్ల ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం సాయి భౌతిక కాయం బెంగళూరు […]
అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెంటకీ రాష్ట్రంలో 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవటంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కెంటకీలో మొత్తం రెండు వందల మైళ్ల నుంచి 227 మైళ్ల వరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని మేఫీల్డ్ నగరంలో టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఇక..కెంటకీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన గాలులకు… […]
సింగరేణిలో మూడు రోజుల సమ్మె ముగిసింది.భూగర్భ గనులతోపాటు ఓపెన్ కాస్టుల్లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది.మంచిర్యాల ,కొమురం భీం జిల్లాల్లోని బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్ ఏరియల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి. 72 గంటలపాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం, జాతీయ కార్మిక సంఘాలు AITUC, INTUC, HMS, BMS, CITU లు సమ్మెలో పాల్గొన్నాయి. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్ధతుగా ముందుకొస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిసి స్టీల్‌ఫ్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కోరారు. కేంద్రం మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని పదేపదే చెబుతూ వస్తోంది. కేంద్రం తీరు మార్చుకోకపోవడంతో ఇవాళ కార్మికుల ఆందోళనకు సంఘీభావంగా గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఇవాళ దీక్ష చేయనున్నారు పవన్ . ఉదయం 10 నుంచి సాయంత్రం […]
టీఆర్ ఎస్ పార్టీ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫంక్షన్స్ ఉన్నాయనే టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటేనని… పార్లమెంట్ లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చిందని మండిపడ్డారు. గతంలో ఆ రెండు పార్టీ లు పొత్తు పెట్టుకున్నాయని.. సీఎం సంతకాలు చేసేటప్పుడు సోయిలో ఉండి చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో సంతకం పెట్టాడు… […]
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 32 మందికి ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కరోనా సోకింది. అయితే, ఇందులో సగం మంది బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. మహారాష్ట్రలో ఇంత వరకూ 17 మంది ఒమిక్రాన్ బారిపడ్డారు. మహారాష్ట్ర నిన్న ఒక్క రోజే ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో ఒకరు ఓ మూడేళ్ల చిన్నారి కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని దార్వీ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కూడా […]
రాత్రికి రాత్రి మొక్క పెరిగి పెద్ద కాదు. అందుకు సమయం పడుతుంది. అలాగే, పంట పండించడానికి సహనం కావాలి. ముందు భూమిని దున్నాలి. తరువాత విత్తనాలు చల్లాలి. అవి మొలకెత్తి పెరుగుతున్నపుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే, చైతన్యం, ఆశ, భయం, నమ్మకం, అప్రమత్తత వీటన్నిటి కలయికే వ్యవసాయం. ఉద్యమంలో భాగంగా రైతులు చేసింది కూడా ఒక విధమైన వ్యవసాయమే. 2020 నవంబర్ 26న పంజాబ్ రైతులు ఇళ్లు విడిచి ఢిల్లీ వెళ్లారు. రాజధాని సరిహద్దుల్లో […]
ధాన్యం సేకరణపై కేంద్రంపై యుద్ధం ప్రకటించిన అధికార టీఆర్‌ఎస్.. తదుపరి కార్యాచణ ఏంటి? తాటతీస్తాం.. మెడలు వంచుతామని చెప్పిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. మరి.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్‌ఎస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించిన టీఆర్‌ఎస్..! తెలంగాణలో వరి రైతుల ఇక్కట్లు ఎలా ఉన్నాయో.. ధాన్యం రాశుల దగ్గర చూస్తే తెలుస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే వర్షం పాలై.. ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక.. కొనుగోలు చేసేవారు […]
గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ను ఇవాళ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… MRI, cathalab సెంటర్లను 45 రోజుల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ ఇంకా తెలంగాణలోకి రాలేదన్నారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన అనుమానితులకు 13 మందికి నెగటివ్ వచ్చిందని….రెండు కేసులు పెండింగ్ లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతామన్నారు. కరోనా సమయంలో […]