అమెరికాలో టోర్నడోల బీభత్సం.. ఎమర్జెన్సీ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కెంటకీ రాష్ట్రంలో 70 మంది క్యాండిల్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోవటంతో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు అధికారులు. కెంటకీలో మొత్తం రెండు వందల మైళ్ల నుంచి 227 మైళ్ల వరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. రాష్ట్రంలోని మేఫీల్డ్ నగరంలో టోర్నడోల దెబ్బకు బాంబు పేలినట్లుగా అనిపించిందని చెబుతున్నారు స్థానికులు. ఇక..కెంటకీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన గాలులకు… కరెంటు స్తంభాలు నేలకూలాయి. వైర్లు తెగిపోయాయ్. దాదాపు మూడు లక్షల మందికి విద్యుత్ లేకుండా పోయింది. టోర్నడోల ప్రభావం తగ్గిన తర్వాత…. విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు… టోర్నడోల దెబ్బకు ఎరిగిపడ్డాయ్.
పరిస్థితులు ఆందోళనకరంగా మారటంతో… రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు… ప్రజలెవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కెంటకీ రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యంత ప్రమాదకరమైన టోర్నడో అని గవర్నర్ అండీ బేషర్ తెలిపారు. అటు… మిస్సోరిలో ఒకరు మృత్యువాతపడ్డారు. కొన్ని ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. 1925వ సంవత్సరంలో మిసోరిలో 219 మైళ్ల మేరకు టోర్నడోల ప్రభావం కనిపించింది. అప్పట్లో ఇక్కడ 695 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు…ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలోనూ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. దక్షిణ ఇల్లినాయిస్‌లోని అమెజాన్ గిడ్డంగిలో వంద మంది చిక్కుకుపోయారు. మరోవైపు.. అర్కాన్సాస్‌లోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఇరవై మంది చిక్కుకున్నారు. వాతావరణ మార్పులతో టోర్నడోలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టెన్నిసీలో ముగ్గురు చనిపోయారు. ఇక్కడ డిసెంబరులో టోర్నడోలు అరుదుగా ఏర్పడతాయని చెబుతున్నారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!