ప్రధాని మోడీకి తమిళనాడు సిఎం స్టాలిన్ లేఖ రాశారు. కావేరీ బేసిన్ లో హైడ్రోకార్బన్ వెలికితీత బిడ్డింగ్ ను వెంటనే ఆపేలా పెట్రోలియం, సహజ వనరుల శాఖను ఆదేశించాలని ప్రధాని మోడీని లేఖలో స్టాలిన్ కోరారు. కావేరి బేసిన్ రైతులకు ఈ ప్రాజెక్టు ముప్పుగా మారనుందని, ఆ ప్రాంత పర్యావరణ పరిరక్షణకు ఇది విఘాతం కలిగిస్తుందని ప్రధానికి లేఖలో స్పష్టం చేశారు స్టాలిన్…
ఈ అంశంలో వెంటనే కల్పించుకోవాలని, అలాగే భవిష్యత్తులో ఈ తరహా ప్రాజెక్టులపై ముందుకెళ్లే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించేలా పెట్రోలియం శాఖను ఆదేశించాలని కోరారు సిఎం స్టాలిన్.