ఈటలపై మరోసారి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. వ్యక్తులు ముఖ్యం కాదు వ్యవస్థ ముఖ్యమని..మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ కు ఉద్యమం నుండి ఇప్పటి వరకు సముచిత స్థానం ముఖ్యమంత్రి ఇచ్చారని.. ముఖ్యమంత్రికి ఈటల రాజేందర్ కు మధ్యలో ఎం జరిగిందో నాకే కాదు ఇక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదని కామెంట్ చేశారు. ఈటల రాజేందర్ కు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలి…ఒక్కటే కారణం ముఖ్యమంత్రి కార్యాలయానికి రానివ్వలేదు అంటున్నారని చురకలు అంటించారు. రాష్ట్రంలో కలెక్టర్ వద్దకు వెళ్లిన అనుమతి తీసుకుని వెళ్తామని.. అటువంటిది ముఖ్యమంత్రి దగ్గర అనుమతి అవసరమే కదా అని పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తులు బిజెపిలోకి వెలితారా, జై శ్రీ రామ్ అంటరా అని నిలదీశారు. గుజరాత్ లో బిసిలు, దళితులను ఊచకోత కోసిన పార్టీలో ఎలా చేరుతావని ఈటలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశతోనే ఇదంత కుట్ర చేశాడని మండిపడ్డారు.