ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వాల్యుయేషన్ పై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో గవర్నర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని లేఖలో కోరారు లోకేష్. ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ప్రతిష్టని దెబ్బతిస్తున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ సభ్యులను నియమించే అధికారం ఉన్న మీరు తక్షణమే జోక్యం చేసుకొని అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని లోకేష్ డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే.. ఏపీపీఎస్సీపై నిరుద్యోగ యువతకు తిరిగి నమ్మకం కలిగేలా ప్రక్షాళన చేయాలని గవర్నర్ కు లోకేష్ కోరారు.