ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే..ఆ కేసుల సంఖ్య ఇవాళ కాస్త పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2974 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 17 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో.. 3290 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,37,201 కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,99,361 కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ […]
రాజకీయాల్లో విమర్శలు కామన్. కొందరు శ్రుతిమించి మాటల తూటాలు పేలుస్తారు. ఇంకొందరు హద్దేలేదన్నట్టుగా వాగ్భాణాలు సంధిస్తారు. ఈ విషయంలో ఆ మామా అలుళ్లు ఆరితేరిన వారే. కాకపోతే అల్లుడు దూకుడుగా వెళ్తుంటే.. మామా స్పీడ్ తగ్గించారట. దాంతో మామకు ఏమైంది అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. వారెవరో ఈస్టోరీలో చూద్దాం. 2014 నుంచి ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రసైన ఆమదాలవలసలో.. మామా అల్లుళ్ల మాటల యుద్ధం పీక్స్‌కు చేరుకున్న […]
తెలంగాణ సర్కార్.. కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా? జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను.. ఏ విధంగా అధిగమించనుంది? పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది? తెలంగాణ నీటివాటా కోసం పార్లమెంట్‌లో ఫైట్ కృష్ణా.. గోదావరి రివర్‌బోర్డు మేనేజ్‌మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తున్నందున.. ఈలోపే […]
తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి. […]
తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రైతలను చాలా ఇబ్బందులకు గురి చేశారని… రైతులు కొట్టిన చావు దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిందని చురకలు అంటించారు. చంద్రబాబు ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక రైతుకు అయినా ఐదు రూపాయలు చెల్లించారా?? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని…చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏడాదికి సగటున 55 లక్ష మెట్రిక్ […]
పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సోమవారం సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. red also : కేటీఆర్ కు దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఇక సీఎం జగన్ పర్యటన వివరాల్లోకి వెళితే… ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 11.10 గంటల నుంచి 12 […]
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వాగ్ధానం చేసిన వరద సాయాన్ని యుద్ధ ప్రాతిపాదికన విడుదల చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇస్తామన్న వరద సాయం ఏ కారణం చేత ఇంకా ఇవ్వడం లేదని ప్రశ్నించిన దాసోజు శ్రవణ్… దాదాపు 5లక్షమంది అక్టోబర్ 2020 వరద బాదితులు నష్ట పరిహారం కోసం ఎదురు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. నష్ట పరిహారం ఎప్పుడు […]
పెట్రోల్ ధరలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయని నిప్పులు చెరిగారు. ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని చురకలు అంటించారు. read also […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై […]
ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్‌నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. వాస్తవంలో […]