పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా పార్లమెంట్ లో వైసిపి ఎంపీలు వంగా గీత, చంద్రశేఖర్, గురుమూర్తి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు కు జీవం పోసింది వైఎస్ఆర్ అని.. అన్ని అనుమతులు తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి దేనని వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని…పోలవరం కు 55 వేల కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. […]
సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని… రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ ను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు రాకుండా రేవంత్ ను అడ్డుకున్నారని… ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ కు వచ్చే సభ్యుడిని అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కి ఉన్న ప్రజాస్వామ్య హక్కులను టిఆర్ఎస్ కాలరాస్తుందని…తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణను 100 రోజుల నుంచి […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. read also : ఈశాన్య భారతాన్ని వణికిస్తోన్న డెల్టా వైరస్ పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 […]
కరోనా డెల్టా వేరియంట్ ఉధృతి ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తోంది. సెకండ్ వేవ్ నెమ్మదించినా.. రోజువారీ కేసుల శాతం తక్కువగా ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి వేగం తీవ్రతను తెలియజేసే ఆర్- ఫ్యాక్టర్ అధికంగా ఉండటంతో అన్ని రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. read also : అలర్ట్ : మరో మూడు రోజుల పాటు వర్షాలు కేసులు పెరుగుతుండటంతో మణిపూర్ పది రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. పొరుగునున్న మిజోరంలో ఆదివారం రాత్రి నుంచి […]
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, ఈ రోజు బలహీన పడింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 17°N అక్షాంశం వెంబడి స్థిరంగా ఉండి, సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది. read […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని రూల్ 267 కింద ఆయన ఈ నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటిని పక్కన పెట్టి రూల్ 267 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చను ప్రారంభించాలని ఆయన నోటీసులో కోరారు. read also : తెలంగాణ […]
తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఎల్ రమణ స్థానంలో బక్కని నర్సింహులును నియమించారు చంద్రబాబు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులు… 1994-99 లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. read also : టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం ఈ […]
టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం పెడుతుంది. ఒలింపిక్స్ నిర్వహించే విలేజ్‌లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. స్క్రీనింగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా సోకింది. ఒలింపిక్ విలేజ్‌లో మొన్న తొలి కేసు నమోదయ్యింది. ఇకపై ప్రతిరోజు క్రీడాకారులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించనున్నారు. read also : పార్లమెంట్ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతండటంతో […]
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే […]
హుజురాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గీయులగా గొడవలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్ మండలం గోపాలపూర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఈటల అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాల్ పూర్ గ్రామంలో కరెంట్ పోల్స్ కు కట్టిన బిజెపి జెండాలను తొలిగించి… టిఆర్‌ఎస్ జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. read also : నేటి నుంచి ఏపీలో […]