అధికారం కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో ఓ ప్రయోగం చేసింది టీడీపీ. మాజీ ఎమ్మెల్యేను తప్పించి నియోజకవర్గ బాధ్యతలను మరోనేత చేతుల్లో పెట్టింది. గ్రౌండ్‌లో మాత్రం సీన్ మరోలా ఉందట. ఓ మాజీ మంత్రి కుమారుడు అక్కడ కన్నేయడంతో రాజకీయం రసకందాయంలో పడిందట. టీడీపీ అంతర్గత రాజకీయాలు గవిరెడ్డిని ఓడించాయా? విశాఖజిల్లా మాడుగుల. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆరుసార్లు ఇక్కడ పసుపు జెండానే ఎగిరింది. 2009లో రాష్ట్రంలో అధికారాన్ని […]
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని వైసీపీ సర్కార్ ప్రశ్నించాలని.. కేంద్రాన్ని అడగకుంటే తప్పు చేసినట్టు అవుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో… వైసీపీ… అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ మొదలు పెడుతున్నామని…పేర్కొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు […]
అమరావతి తిరుపతిలో జరిగే రాజధాని రైతుల బహిరంగ సభకు సీపీఎం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రాజధాని రైతులు తిరుపతి సభకు ఆహ్వానించారు.. మేమూ వెళ్లాలనుకున్నామన్నారు. కేంద్ర బీజేపీ నేతలు ఈ సభలకు హాజరవుతున్నారని తెలిసిందని… రాష్ట్ర ప్రయోజనాలకు హాని తలపెట్టింది బీజేపీనేనని ఆగ్రహించారు. అలాంటి బీజేపీ నేతలు పాల్గొనే సభల్లో మేం పాల్గొనబోమని.. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలనేదే సీపీఎం విధానమని గుర్తు చేశారు మధు. ఢిల్లీలో ఓ […]
16.12.2021 అంటే నిన్న గురువారం నాడు వి.ఐ.టి – ఎ.పి విశ్వవిద్యాలయంలో వి.ఐ.టి – ఎ.పి స్కూల్ ఆఫ్ బిజినెస్ (VSB) అధ్వర్యంలో 3 రోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ గ్లోబల్ సినారియో(ICBTEGS) అంతర్జాతీయ సదస్సు వర్చ్యువల్ విధానంలో ప్రారంభమయ్యింది. ఈ సదస్సు 16న ప్రారంభమై , 18 డిసెంబర్ 2021వరకు వర్చ్యువల్ విధానంలో కొనసాగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా సీనియర్ డైరెక్టర్ ఎకనామిక్ యూత్ అండ్ […]
టీఆర్ఎస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్… కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న డీఎస్.. కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే… డీఎస్ రాకపై నిజామాబాద్ జిల్లా తో పాటు..రాష్ట్రంలోని సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీఎస్ కి క్లియరెన్స్ రాలేదు. అప్పట్లో డీఎస్ చేరిక అలా వాయిదా పడింది.ప్రస్తుతం సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు చూస్తుండడంతో , ds మరోసారి తన […]
ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు కాపు కాస్తారు. ఉద్యమాల్లో కాంగ్రెస్‌తో దోస్తీ. తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీల తీరు ఇది. రైట్ టర్న్ తీసుకుంటున్న సమయంలో లెఫ్ట్ ఆలోచనలు ఎందుకు మారుతున్నాయి? కామ్రేడ్ల నిర్ణయాల వెనక బలమైన కారణాలు ఏంటి? ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల వైఖరిపై ఆసక్తికర చర్చ..! తెలంగాణలో ఎన్నికలేవైనా.. కమ్యూనిస్ట్ పార్టీలపై కూడా చర్చ జరుగుతుంది. సీపీఐ, సీపీఎంలు ఏం చేస్తాయి? పోటీ చేస్తాయా.. లేదా? ఎవరికి మద్దతుగా నిలుస్తాయి అనేది ఆ చర్చ సారాంశంగా ఉంటుంది. […]
ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా..? సర్వే పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారా? తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న నాయకులు ఎవరు? ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను కలవరపెట్టేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? రాబిన్‌శర్మ బృందంతో టీడీపీ పరిస్థితిపై సర్వే..! గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నాలుగుచోట్ల టీడీపీ గెలిచింది. ఈ నలుగురిలో ఒకరు జారుకున్నా.. మిగిలిన వాళ్లంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్ […]
ఖమ్మంజిల్లా టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు? ఖమ్మంలో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందెవరు? పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్‌పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి […]
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8 కి చేరింది. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇటీవలే ఆ మహిళ విదేశాల నుంచి వచ్చినట్లు హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చిందని.. మిగతావి నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారికి వచ్చినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ […]