మంత్రి పదవిపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక లెక్కలు.. కూడికలు వేసుకున్నారు కూడా. చట్టసభలకు వెళ్లినా.. కేబినెట్‌లో బెర్త్ వాళ్లకు అందని ద్రాక్షాయేనా? సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? కొత్త ఎమ్మెల్సీలు చాలా ఆశలే పెట్టుకున్నారా? పాత కొత్త కలిపి.. తెలంగాణ శాసనమండలికి ఇటీవల 19 మంది ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది.. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్, డిప్యూటీ […]
తెలంగాణ కాంగ్రెస్ పాదయాత్రల బాట పడుతోంది. పెరిగిన ధరలే అస్త్రాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనంలోకి వెళ్తోంది. మరోవైపు…భూ సంస్కరణలపై ఒక రోజు పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు రాహుల్ గాంధీ. నిత్యవసర ధరల పెరుగుదలపై ఏఐసీసీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పాద యాత్రలు చేపట్టారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో… తెలంగాణ పిసిసి ఆందోళన బాట పట్టింది. పిసిసి చీఫ్ రేవంత్ చేవెళ్ల నుండి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ జాతీయ […]
కేసీఆర్ అధ్యక్షతన నేడు టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గం ఇందులో పాల్గొంటారు. ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రంతో డీ అంటే ఢీ అంటున్న టిఆర్ఎస్ కార్యాచరణ… ఈ సమావేశం తర్వాత ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు […]
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,447 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 391 మంది కోవిడ్ బాధితులు మృతి చెంచారు.. ఇదే పమయంలో 7,886 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు తన బులెటిన్‌లో పేర్కొంది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుతం దేశ్యాప్తంగా 86,415 యాక్టివ్ కేసులు […]
ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జల్లేరు వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 10 మంది నీట మునిగి మృతిచెందగా… 30 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి జంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బస్సు ప్రమాదానికి కారణం కచ్చితంగా తెలియకున్నా.. ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించపోయి బస్సు వాగులో పడిందంటున్నారు అందులోని ప్రయాణికుడు. […]
దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వేరియంట్ 70 దేశాలకు పైగా పాకేసిందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ వేరియంట్ మన దేశంలోనూ క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7 గా నమోదు అయింది. అయితే.. ఇవాళ […]
యాసంగి కాలంలో.. వరి వేసిన రైతులకు రైతు బంధు కట్ చేస్తామనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. రైతు బంధు పై అప్పుడు లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై నెపం మోపి తప్పించుకోవాలని సీఎం కేసీఆర్ చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రైతు బంధు పేరుతో… సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు […]
ప్రకాశం : ఒంగోలులో ఒమిక్రాన్ కేసుల కలకలం రేపింది. నగరంలోని భాగ్యనగర్ 4వ లైనులోని ఓ అపార్ట్మెంట్ లో రెండు కేసులు నమోదయ్యాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారింది ఓ ఆడియో. ఇప్పటి వరకు విదేశాల నుండి వచ్చిన 784 మందిని గుర్తించారు వైద్యశాఖ అధికారులు. 400 మందికి కరోనా పరీక్షలు పూర్తి చేశారు. మరో 384 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుండి తిరిగి వచ్చి ట్రేస్ అవుట్ […]
అచ్చ తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది అతను నటించిన ‘చక్ర’, ‘ఎనిమి’ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘సామాన్యుడు’ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది. దీనితో పాటు తన ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్ గా ‘డిటెక్టివ్ -2’ తీస్తూ, ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు విశాల్. అలానే ఎ. […]