తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై జస్టిస్ చంద్రు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందని వెల్లడించారు. సమ్మె ఎన్ని రోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్.. కార్మికులను బెదిరించారని ఆగ్రహించారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి అని నిలదీశారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలని పేర్కొన్నారు. జలహక్కులకు […]
సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హింస, ఘర్షణలు ప్రేరేపించే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని చూపించాలని కోరారు. విష ప్రచారం చేస్తూ రైతులను తప్పుదారి పట్టిస్తున్న టీఆర్ ఎస్ నేతలను ఉరికించాలని… కేసీఆర్ కు కుడివైపు అసదుద్దీన్ ఒవైసీ, ఎడమవైపు అక్బరుద్దీన్ ఓవైసీ పెట్టుకుని మత పర హింస గురించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ముంబైలో “ఆర్ఆర్ఆర్” ఈవెంట్… మేకర్స్ నిర్ణయంతో […]
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. ఇంటర్ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సారి జరిగిన ఇంటర్ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేనని గుర్తు […]
తెలంగాణలో కరోనా క్రమ క్రమంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,484 శాంపిల్స్ పరీక్షించగా… 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 205 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,430 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,71,655 కు పెరిగాయి.. […]
వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చి కునేందుకు టీఆర్ ఎస్ సర్కార్ సన్నద్ధం అయింది. ఇందు లో భాగంగానే… ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లింది తెలంగాణ మంత్రుల బృందం. అంతేకాదు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీకి అపాయింట్ మెంట్ కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు , జగదీశ్వర్ రెడ్డి ,పువ్వాడ అజయ్ […]
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరిగి పోతుంది. తాజాగా తెలంగాణ లో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని వైద్య శాఖ పేర్కొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20 కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రిస్క్ దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రనికి వచ్చిన ఇద్దరికీ కొత్త వేరియంట్ వచ్చిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణ […]
తెలంగాణ సీఎం కేసీఆర్.. రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును డిసెంబర్ 28 వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు సీఎం కేసిఆర్. ప్రారంభించిన వారం నుండి పది రోజుల్లో గతంలో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. రైతు బంధు అమలు పై రైతులు ఆందోళన చెందనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే.. దళిత బంధు […]
సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ లపై రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. స్థానిక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని..కాంగ్రెస్ లో నుండి పోయ్యేది లేదు… ఇక టీఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చే వాళ్ళే ఉంటారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ చెరువు తెగింది..ఇక కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉండాలని కోరారు. గతంలో…. జేబు నిండా పైసలు తీసుకెళ్తే… సంచి నిండా కూరగాయలు వచ్చేవని..కానీ ఇప్పుడు సంచి నిండా డబ్బులు తీసుకుపోతే […]
కరోనా కేసులు సమయంలో… సేవలందించిన డాక్టర్ కేర్ వైద్యులకు ఈరోజు డాక్టర్ కేర్ అవార్డు.. ద్వారా వారి సేవలకు గాను ఈ అవార్డు ప్రధానం చేశారు. రెండు వేల మంది పని చేసే డాక్టర్ కేర్ సంస్థలు వంద మంది డాక్టర్లను కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తించి, అలాంటి విపత్కర పరిస్థితులలో వారి కుటుంబాలకు కూడా దూరంగా ఉండి రోగులకు సేవ చేయడం, వారి ధైర్యసాహసాలకు మెచ్చుకుని దాదాపు 100 మంది వైద్యులకు అవార్డు […]
వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల.. మరో పోరాటానికి సంసిద్ధమౌవుతున్నారు. తెలంగాణ రైతుల కోసం… రైతు ఆవేదన యాత్ర చేపట్టనున్నారు వైయస్ షర్మిల. ఈ రైతు ఆవేదన యాత్రను రేపుటి (ఆదివారం) నుంచి ప్రారంభించనున్నారు వైఎస్ షర్మిల. ఈ యాత్రలో భాగంగానే.. రేపు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల పరామర్శించనున్నారు. అలాగే.. మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్లనున్నారు షర్మిల. […]