హైదరాబాద్ అంబర్‌పేట్ జన ఆశీర్వాద సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అంబర్‌పేట్ తన ప్రాణమంటూ… కంటతడి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తాను ఢిల్లీలో ఉన్నానంటే… అది అంబర్‌పేట్ వాసుల వల్లే అన్నారు కిషన్‌రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల పాలనను తరిమికొడతామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ప్రధాని మోడీ ఏడేళ్లుగా ప్రజల కోసం పనిచేస్తుంటే… సీఎం కేసీఆర్ ఏడేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు. దేశంలో సచివాలయం లేని రాష్ట్రం… తెలంగాణ మాత్రమే అన్నారు కిషన్‌రెడ్డి. సచివాలయానికి వెళ్లడం ఇష్టం లేకనే… కేసీఆర్ సెక్రటేరియట్ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు.