తెలంగాణ క్యాబినెట్‌లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కతోబోతుందా? ఒకరు కాదు.. ఇద్దరికి అవకాశం ఉంటుందా? ఎవరెవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? కేబినెట్‌లోకి దళిత ఎమ్మెల్యేలను తీసుకుంటారా? తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు దళిత బంధు స్కీమ్‌ను అమలులోకి తీసుకొచ్చింది. మంత్రివర్గంలో కూడా ఇద్దరు దళిత సామాజికవర్గ ఎమ్మెల్యేలకు చోటుదక్కే అవకాశం […]
బ్రహ్మోత్సవాల కోసం పుష్కరిణి మరమ్మతు పనులును చేపట్టింది టీటీడీ. శ్రీవారి ఆలయంలో పుష్కరిణి హరతిని నెల రోజులు పాటు రద్దు చేసింది. ఇప్పటికే పనులు ప్రారంభించింది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే తిరిగి సెప్టెంబర్ 13నుంచే పుష్కరిణిని భక్తులకు అందుబాటులోకి తెస్తారు.. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం మూలలో స్వామివారి పుష్కరిణి నెలకొని వుంటుంది. ముల్లోకాలలో వున్న అన్ని తీర్దాలు స్వామి పుష్కరిణిలో కలుస్తాయని ఆలయ పండితులు పేర్కొంటారు. దీంతో శ్రీవారి పుష్కరిణిని దర్శించుకున్నా.. అందులో స్నానం చేసిన సమస్త […]
తాడేపల్లి : టీడీపీ పార్టీపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన వనరు అని సీఎం వైఎస్ జగన్ భావించారని..అంబేడ్కర్ బాటలో సీఎం జగన్ నడుస్తూ పాఠశాలను తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో స్కూల్స్ బాగాలేదని వార్తలు రాస్తున్నారని… దశల వారీగా స్కూల్స్ అభివృద్ది చేస్తున్న విషయం వాళ్ళకి తెలియదా ? అని నిలదీశారు. ఆ స్కూల్స్ దుస్థితికి చంద్రబాబు కారణం కదా…? పక్కనే ఉన్న ఆ స్కూల్స్ […]
నిన్నటి నుంచి ఏపీ టీడీపీ పార్టీలో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహణలోనే లోపాలున్నాయని, పార్టీలో ప్రస్తుతం నేను ఒంటరివాడిని అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీకి రాజీనామాపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని కూడా అన్నారాయన. దీంతో పార్టీ వర్గాల్లో కలకలం రేగింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోవైపు… టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్ […]
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు. Read Also : […]
విజయవాడ : శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండి క్యూలైన్లో వేచి ఉన్నారు భక్తులు. అటు వరలక్ష్మీ దేవి, లక్ష్మీ దేవి గా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతోషంగా ఉందంటున్నారు. ఇక అమ్మవారి మూలవిరాట్ విగ్రహానికి వరలక్ష్మి దేవి అలంకరణ చేశారు ఆలయ సిబ్బంది. శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇక […]
అమరావతి : జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ఎస్సీ నేతలతో చంద్రబాబు సమావేశo నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీల్లో యువ నాయకత్వం రావాలని… వైసీపీ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్ ఎస్సీలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారని… అధికారంలోకి వచ్చాక నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన వర్గాలపైనే జగన్ దాడులు చేయిస్తూ.. వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు. జగన్ రెడ్డి విధ్వంసకర పాలన పట్ల […]
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి […]
తెలంగాణ రాష్ట్ర ప్రజల హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రుల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… హెల్త్ ప్రొఫైల్ రికార్డ్ ప్రాజెక్టు కోసం ములుగు, సిరిసిల్ల జిల్లా ల ఎంపిక చేశామన్నారు. ఈ రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని… ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే, […]
శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి ముఖ్య అతిథిగా స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర శ్రావణ శుక్ల చతుర్దశి తేదీన అనగా 21-08-2021 శనివారం నాడు ఉదయం 7 గంటలకు ”శ్రీ శ్రీనివాస కళ్యాణం” ను ”ది చెన్నై సిల్క్స్ మరియు శ్రీ కుమరన్ గోల్డ్ & డైమెండ్స్” వారు నిర్వహిస్తున్నారు. ఈ వివాహ మహోత్సవం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ”ది చెన్నై సిల్క్స్” భవనం 4 వ అంతస్థులో నిర్వహించబడును. శ్రీశ్రీశ్రీ […]