విజయవాడలో యువతి మృతి కలకలం రేపుతోంది. చార్టెడ్ అకౌంటెంట్ చెరుకూరి సింధు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రసేన్ అనే వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్టు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె ముఖంపై గాయాలుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రసేన్ కు.. సింధుకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ.. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రసేన్ ఇంట్లోనే ఆమె ఉంటోంది. సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.