నారా భువనేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కూతురుగా నారా భువనేశ్వరి పై గౌరవం ఉందని.. అనని మాటలు గురించి మాట్లాడి.. ఆ గౌరవాన్ని చెడగొట్టు కోకండంటూ కౌంటర్ ఇచ్చారు. ఎవరి పాపాన ఎవరు పోయారో అందరికీ తెలుసని… చంద్రబాబు చేసిన పాపలకు పోయిన ఎన్నికలలో 23 సీట్లు పరిమితం చేశారని చురకలు అంటించారు. అసెంబ్లీ నన్ను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టించారు…ఎంతో అవమానానికి గురి చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు […]
పనామా పేపర్స్ లీక్ కేసులో ఐశ్వర్యారాయ్ ఈడీ విచారణ అంశాన్ని కొందరు సభ్యులు ప్రస్తావించడంపై…ఆమె అత్త, ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించి…కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా కామెంట్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఛైర్ ఉద్దేశించి…మీ నుంచి మేము న్యాయం కావాలంటున్నామని…అధికార పార్టీ సభ్యుల నుంచి కాదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని జయాబచ్చన్ హెచ్చరించారు. […]
టీమ్‌ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రీడలు, మానసిక ఆరోగ్యంపై యువతకు అవగాహన కల్పించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న రిషభ్‌పంత్‌తో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వీడియో కాల్‌లో మాట్లాడారు. రాష్ట్ర యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు బ్రాండ్ అంబాసడర్‌గా నియమిస్తున్నట్లు చెప్పారు. ఇక దీనిపై కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్టైల్ లో స్పందించారు. ఇలాంటి గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా […]
టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి. ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు […]
అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్ లోని హారిస్ కౌంటి లో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. సదరు వ్యక్తి ఇప్పి వరకు టీకా తీసుకోలేదని.. అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీన అతడు పడినట్లు సమాచారం అందుతోంది. ఇక ఒక మరణం సంభవించడంతో… అమెరికా అప్రమత్తమైంది. అటు.. యూకేలో ఒమిక్రాన్ మరణాల సంఖ్య […]
మందు బాబులపై తెలంగాణ ప్రభుత్వం భారీ అంచనాలే పెట్టుకుంది. కొత్త సంవత్సరం సమీస్తున్నందున ..రాబోవు రోజులలో కనీసం వెయ్యి కోట్ల రూపాయల ఆదాయాన్ని టార్గెట్ చేసింది. గత ఏడాది డిసెంబర్ నెల చివరి నాలుగు రోజుల్లో 759 కోట్ల రూపాయల మద్యం విక్రయించింది. నూతన సంవత్సరానికి గాను మద్యం స్టాక్ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు జిల్లాలలోని అన్ని డిపోలకు చేరింది. కొత్త మద్యం విధానంలో భాగంగా ఈ సంవత్సరం ప్రభుత్వం 404 వైన్ షాపులు, 159 బార్లకు […]
ప్రపంచ వ్యాప్తంతా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ భారత్‌లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. దీనికి ఒమిక్రాన్ వేరియంట్ కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఐతే, ఇప్పటి వరకు కేసుల సంఖ్య గణనీయంగా పడిపోవటంతో చాలా మంది మాస్కులు ధరించకపోవటం చూస్తున్నాం. ఇప్పుడు థర్డ్ వేవ్ భయంతో మళ్లీ మాస్కులకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం కావాల్సినంత మాస్క్‌ల స్టాక్ ఉన్నా వాటి రేట్లు మాత్రం తగ్గలేదు. ఉదాహరణకు రోజుకు 30ల లక్షల […]
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మా పిల్లలు తినే […]