ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్.జగన్ మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలని… రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలని […]
పేదల పాలిట.. ఆశా దీపం ఎన్టీఆర్ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో ఇటీవల వరదల కారణంగా చనిపోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఒక్కో బాధిత కుటుంబానికి లక్ష రూపాయల చోప్పున చెక్కులను అందించారు నారా భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి…మాట్లాడుతూ… రాయలసీమలో ఇటీవల కురిసిన వర్షాలకు అనేక మంది నష్టపోయారని.. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ […]
రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం […]
కరోనా మహమ్మారి కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గాంధీ ఆస్పత్రిలో విశిష్ట సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా చాలా మంది కరోనా బాధితులు గాంధీ లోనే చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో… మరో అధునాతన సేవలను గాంధీ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకు వచ్చింది. నేటి నుంచి గాంధీ లో జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా.. గాంధీ సూపరిండెంట్ రాజారావు మీడియాకు చెప్పారు. కరోనా […]
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీసీ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. అక్కడక్కడే పరిష్కరించే సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన […]
తెలంగాణ బీజేపీ నేతలు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. అయితే.. గతంలోనే.. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, పార్టీ కీలక నేతలు భేటీ కావాల్సి ఉన్నా… ఆ సమయంలో.. సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో.. ఆ సమావేశం పోస్ట్ పోన్ అయింది. ఇక తాజాగా మరో […]
సి.ఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జగన్ ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమని గుర్తు చేశారు. ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. చివరికి […]
తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనను సాధ్యమైనంత ఎక్కువ మంది సందర్శించేలా కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ. విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యం తో రూ.100 టికెట్ పై 20 శాతం రాయితీ ప్రకటిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ సజ్జనార్ ప్రకటన చేశారు. నగరంలో 24 గంటల టికెట్ పై ఈ నెల 27 వ తేదీ వరకు తగ్గింపు పొందవచ్చని.. ఆర్టీసీ ఓ […]
గోవా లిబరేషన్ డే వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గోవాలోని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో లిబరేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత దేశానికి 1947లో స్వాత్రంత్యం వచ్చినా… గోవా, డామన్ అండ్ డాయ్యు ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తి చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. చివరికి 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ చేపట్టి పోర్చుగీస్ నుంచి విముక్తి చేశారు. అప్పటి నుంచి ఏటా గోవా లిబరేషన్ […]
నల్సార్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన లా స్టూడెంట్స్ కు డిగ్రీ పట్టాలు అందజేశారు. పీహెచ్ డీ చేసిన వారికి గోల్డ్ మెడల్స్ బహుకరించారు. స్నాతకోత్సవం సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ…. డిగ్రీ పట్టాలు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యులకు న్యాయం చేసే విధంగా న్యాయవాదులు తమ వృత్తి నిర్వహించాలని […]