రైతుల పాలిట యముడిలా సీఎం కేసీఆర్ తయారయ్యారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో పంట కొనుగోళ్లలో జాప్యం,అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లయ్య కుటుంబాన్ని ఇవాళ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఏఒక్క నాయకుడూ ఆదుకోలేదని.. బోర్లు వేసుకున్న రైతులకు వైఎస్ ఆర్ ఎంతో చేశారని… పదవుల్లో ఉన్న తండ్రీకొడుకులు ఏం చేసినట్టు? అని నిలదీశారు. రైతు […]
ఆ పదవుల భర్తీపై టీఆర్ఎస్ తేల్చుకోలేకపోతుందా..? ఒకసారి జిల్లా అధ్యక్షుల నియామకం చేయాలని.. మరోసారి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం సరిపోతుందని ఎందుకు భావిస్తోంది? జిల్లాస్థాయిలో గులాబీపార్టీ ఎందుకు ఆచితూచి అడుగులు వేస్తోంది? అప్పట్లో జిల్లా అధ్యక్షుల నియామకంపై టీఆర్ఎస్‌లో చర్చ..! జెండా పండుగతోపాటు పార్టీ సంస్థగత నిర్మాణాన్ని మొదలు పెట్టింది టీఆర్ఎస్. గ్రామ, మండల, మున్సిపాలిటీలలో పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయింది. పార్టీ నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షులను నియమించాలని గులాబీ పెద్దలు అభిప్రాయపడ్డారు. గతంలోనే జిల్లాస్థాయిలో […]
రాజధాని వికేంద్రీకరణ, అమరావతిపై మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని… అమరావతి కూడా ఉంటుందని క్లారిటీఇచ్చారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజదాని వికేంద్రీకరణ అని… అమరావతి అందరిది అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు. అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని… కానీ రియల్ […]
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. ఆ నియోజకవర్గంలో సీట్ ఫైట్ ఓ రేంజ్‌లో సాగుతోంది. అది కూడా ప్రతిపక్ష పార్టీలో…! ప్రత్యేకించి ఆ యువనేత వేస్తున్న పంచ్‌లు.. చేస్తున్న సవాళ్లు పొలిటికల్ హీట్ రాజుస్తున్నాయట. నియోజకవర్గం తన అడ్డా అని ఆ నాయకుడు చెప్పడం వెనక కారణం ఏంటి? కేడర్ ఒత్తిడితో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌గా పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటన..! ధర్మవరం. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో మార్మోగుతున్న పేరు. పొలిటికల్ కాంట్రవర్సీకి కేరాఫ్ […]
పార్టీ మారినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇక్కట్లు తప్పడం లేదా? లోకల్ లీడర్లతో పొసగడం లేదా? స్వపక్షంలోని విపక్షీయుల స్వరం పెరుగుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా? వాసుపల్లి వచ్చాక విశాఖ సౌత్ వైసీపీలో గ్రూపులు పెరిగాయా? వాసుపల్లి గణేష్‌కుమార్. వైసీపీ గాలిలోనూ విశాఖలో గెలిచిన నలుగురు టీడీపీలో ఎమ్మెల్యేలలో ఒకరు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు వాసుపల్లి. అయితే అప్పటి వరకు వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లకు ఎమ్మెల్యే ఎంట్రీ […]
తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కొందరు తమ్ముళ్లు సరిగా పనిచేయలేదా? అలాంటి నాయకులపై చంద్రబాబుకు నివేదిక చేరిందా? ఎవరి పనితీరుపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేసింది? పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి నాయకులు ఎందుకు టచ్ మీ నాట్‌గా ఉండిపోయారు? రైతుల సభను పట్టించుకోని టీడీపీ నేతలపై కేడర్ గుర్రు..! తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభను చాలా గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చేసిన కసరత్తు అంతా ఇంతాకాదు. ఇటీవల […]
కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు.. ఉద్యోగుల బదిలీలు ఉన్నాయా? తెలంగాణ సాధించుకున్నామన్న సంతోషం ఆవిరై.. కొత్త సమస్యను తలెకెక్కించుకున్నామనే భావనలో ఉద్యోగులు ఉన్నారా? ఇంతకీ కొత్త జోనల్ విధానం ఉద్యోగులకు వరమా.. శాపమా..? ఉద్యోగులకు అన్యాయం జరగకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోవడం లేదా? తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఇదే అదునుగా కొందరు అధికారులు పారదర్శకతకు పాతరేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు […]
ధాన్యం కొనుగోళ్ల అంశం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమని పీయూష్ గోయల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు భ్రమలను కల్పిస్తోందని… కేంద్ర ప్రభుత్వ పరంగా రైతులకు భరోసా ఇస్తున్నామన్నారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. గత రబీ సీజన్ లో ఇచ్చిన హామీ మేరకు ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయలేక పోయిందని ఆగ్రహించారు. అవసరం లేకపోయినా, ప్రత్యేక కేసుగా పరిగణించి, 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయల్డ్ […]
30 లక్షలు టార్గెట్. ఆ అంకె వినగానే గుండె గుభేల్ మన్నా.. సవాల్‌గా తీసుకుని టార్గెట్ చేరుకోవాలని అనుకున్నారు నాయకులు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి రివర్స్. చీమ కుట్టినట్టు అయినా లేదట. పార్టీ చేపట్టిన కార్యక్రమానికి ఊ అంటారో.. ఊహూ అంటారో కూడా తెలియని పరిస్థితి ఉందట. సభ్యత్వం నమోదు కోసమే 30 మందికి శిక్షణ..! కొత్త నాయకత్వం రాగానే సభలు.. సమావేశాలు అని ఊదరగొట్టిన తెలంగాణ పీసీసీకి 30 లక్షల సభ్యత్వం నమోదును లక్ష్యంగా పెట్టింది […]
తన జన్మదినం సందర్భంగా…సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నానని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… ఇసుక టన్ను రూ. 475 ధరగా నిర్ణయించామని చెప్పారు.. ఇప్పుడు రూ. 900కు అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. మార్కాపురంలో ఇసుక టన్నురూ. 1200 అమ్ముతున్నారని… ఇరిగేషన్ శాఖ డ్రెడ్జింగ్ చేసే ఇసుకను కూడా జేపీ కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? అని నిలదీశారు. ఇరిగేషన్ శాఖ […]