భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆట పూర్తయేసరికి అతిథ్య జట్టు 77 పరుగులు చేసి దీటుగా బదిలిస్తోంది. ఓపెనర్లు రోరీ బర్న్స్ 31, హమీద్ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి శుభారంభం చేశారు. దీంతో చివరి రోజు ఆ జట్టు విజయానికి 291 పరుగులు అవసరం. మరోవైపు చేతిలో పది వికెట్లు ఉండగా భారత్ విజయం సాధించాలంటే వారిని ఆలౌట్ చేయాలి. నాలుగో రోజు ఆట ఫస్ట్ […]
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ […]
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆరోరోజుకు చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, విభజన హామీల అమలు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సహా పదికి పైగా కీలకాంశాలను కేంద్రం ముందుంచారు సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌తోనూ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఈ […]
మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర […]
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సాయంత్రం కుండపోత వర్షం కురుస్తోంది. నిమిషాల వ్యవధిలో ఆకాశంలో మబ్బులు కమ్మేసి భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా అంబర్‌పేట్- మూసారాంబాగ్ బ్రిడ్జి నీటమునిగింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో ప్రజలు తీవ్ర […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కాబోతున్నారు. ఈ నెలాఖరులో యుఎస్‌లో ప్రధాని మోడీ పర్యటించే అవకాశం ఉంది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత…తొలిసారి అమెరికా వెళ్తున్నారు. మోడీ, బైడెన్ సమావేశం తేదీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే…ఈ నెల 22-27 మధ్యలో ఇరువురు నేతలు సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ, జో బైడెన్‌లు…వర్చువల్ విధానంలో ఇప్పటి మూడుసార్లు చర్చలు […]
ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీం ఇండియా ఏకంగా 466 పరుగులకు అలౌటైంది. రెండో సెషన్ లో పంత్ 50 పరుగులు మరియు శార్దూల్ ఠాకూర్ 60 పరుగులు, చేసి జట్టును ఆదుకున్నారు. ఇక వీరిద్దరికి తోడు టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్ 25 పరుగులు మరియు బుమ్ర4ఆ 24 పరుగులు చేసి.. రాణించారు. దీంతో భారత్ భారీ స్కోర్ సాధించడమే కాకుండా […]
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీలో ఆందోళన చేపట్టింది. కర్నూలు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు… కలెక్టర్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డిసహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను బలవంతంగా స్టేషన్‌కి తరలించారు పోలీసులు. కాగా… ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన సోమువీర్రాజు… ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పై ఏపీ సర్కార్ […]
లెక్కలేనన్ని పథకాలు..నెలనెలా ఇంటికే డబ్బులు. ఇళ్లు, స్థలాలు..ఒకటేమిటి.. అసలు సిసలు సంక్షేమ రాజ్యం అంటే ఏంటో ఏపీలోనే చూడాలన్నట్టు ప్రభుత్వం ఉంది. అసంతృప్తి అనేదే లేని జనం మా దగ్గర ఉన్నారని అధికార పార్టీ ఘనంగా చెప్పుకుంటుంటే, పాపం ఎమ్మెల్యేలు మాత్రం లబోదిబో అంటున్నారట. ప్రజలంతా హ్యాపీగా ఉంటే ఎమ్మెల్యేలకు వచ్చిన ప్రాబ్లం ఏమిటనుకుంటున్నారా? అయితే చూడండి.. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 2 సీటత్లు మినహీఆ అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దానికి తగ్గట్టుగానే […]
కొత్త బాస్ లు వచ్చాక కొత్త పనులు జరగటం సహజమే. తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమీషనర్ లు దూకుడు పెంచారట. అధికారుల బదిలీలతో పాటు, విధినిర్వహణపై ఒత్తిడి కూడా పెంచారట. ఇది డిపార్ట్‌మెంట్ లో కలకలానికి కారణమైందట.. పోలీస్ డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టింగ్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్ లకు కొత్త గా అధికారులను నియమించింది. కొత్త […]