తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,59, 543 కి చేరింది. ఇందులో 6,50,114 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,545 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3884 కి చేరింది. […]
వినాయక చవితి వస్తుందంటే ఊళ్లల్లో ఉండే సందడే వేరు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ప్రతియేటా ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వినాయక ఉత్సవాలకు బ్రేకులు పడ్డాయి. పండుగలను సంబరంగా చేసుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో చాలా అరుదైన చెప్పొచ్చు. గతేడాది కరోనా కారణంగా పండుగలన్నీ కళతప్పాయి. కరోనా నిబంధనల మధ్య మొక్కుబడిగా కొన్ని పండుగలకు […]
శ్రీకాకుళం : ఆమదాలవలసలో జనసేన శ్రేణుల పై వైసీపీ దాడిని ఖండించారు పవన్ కళ్యాణ్. దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది జనసేన పార్టీ. రోడ్ల అధ్వాన్న స్థితిని తెలియచేస్తే దాడులు చేస్తారా? పోలీసుల సమక్షంలోనే ఆమదాలవలస జనసేన నాయకుడు రామ్మోహన్ రావు పై దాడి చేశారని పవన్ ఫైర్ అయ్యారు. సమస్యను తెలియజేసిన వారిని గాయపరిచి ఎదురు కేసులు పెడతారా ? జనసేన శ్రేణుల పై దాడులు చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం […]
టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ కసరత్తులు చేసింది. చాలా టైం తీసుకొని మరీ కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. అయితే టీపీసీసీ పదవి తనకే దక్కుతుందని మొదటి నుంచి ఆశపడి భంగపడ్డ కోమటిరెడ్డి మాత్రం రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీలుచిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేయడంతోపాటు టీపీసీసీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు. ఈ […]
వినాయక చవితి నేపధ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అద్దూ అదుపు లేదని… నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని.. ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ జీవో ఇచ్చారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని […]
శ్రీకాకుళం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి హనుమంతు అప్పయ్యదొర పేరు పెడతామని వెల్లడించారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని స్పష్టం చేశారు. అప్పయ్య దొర ఆశయాలను కొనసాగిస్తామని… వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్యదొరే గుర్తుకు వచ్చారన్నారు. వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని తెలిపారు. సినిమాలో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొరలో ఆ […]
హుజూరాబాద్ బై పోల్…..తెలంగాణలో హైవోల్టేజీ ఎలక్షన్. ఈ నెలలోనే అనుకున్నారంతా. షెడ్యూల్ రేపో మాపో అన్నారు. ఇంకేముంది ..అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాల్లో చెప్పలేనంత హడావుడి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. భారీ ర్యాలీలు, సభలు.. పంచ్ డైలాగులు. దాంతో పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. కానీ అంతలోనే పెద్ద షాక్. ఎన్నికలు ఇప్పట్లో లేవంటూ ఈసీ అనౌన్స్‌మెంట్. దాంతో నేతల ఉరిమే ఉత్సాహం కాస్తా చల్లబడింది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై దాదాపు ఐదు నెలలవుతోంది. […]
భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కోచ్ రవి శాస్త్రి కి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే… రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్నటు వంటి బౌలింగ్ కోచ్ అరుణ్, […]