ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ మరోసారి విధ్వంసం సృష్టించింది. కిర్కుక్ సమీపంలోని చెక్‌పోస్ట్ దగ్గర దాడికి దిగింది. ఈదాడిలో పదమూడు మంది పోలీసులు మరణించారు.ఐఎస్ఐఎస్ దాడులతో ఇరాక్ అతలాకుతలమవుతోంది. ఇరాకీ పోలీసులే లక్ష్యంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో.. పదముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ ఉత్తరభాగంలోని కిర్కుక్ నగర సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద .. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడికి దిగింది. రెండు చోట్ల దాడులు చేశారు ఉగ్రవాదులు. అర్థరాత్రి సమయంలో దాడి జరిగినట్లు సీనియర్ ఇరాకీ పోలీస్ అధికారి తెలిపారు. […]
కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ నామమాత్రంగానే ఉంది. ఉమ్మడి ఆంధప్రదేశ్ లో కాస్తోకూస్తో బలంగా ఉన్న బీజేపీ రాష్ట్రవిభజనతో రెండు ప్రాంతాల్లోనూ పుంజుకునే పనిలో పడింది . తెలంగాణలో మాత్రం బీజేపీ క్రమంగా బలపడుతుండగా.. ఏపీలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా ఉందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ కొత్త బీజేపీ అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. ఏపీలో కొత్త […]
అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ […]
అమెరికా పేరు చెబితేనే అదొక భూతలస్వర్గమని అని అందరూ చెబుతుంటారు. స్వేచ్ఛ, సమానత్వానికి అమెరికన్లు దిక్సూచిగా నిలుస్తుంటారు. శక్తి, సంపద, రక్షణ వ్యవస్థ వంటి విషయాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ప్రపంచ దేశాలిచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా అవలంభిస్తున్న తీరుతో ఆదేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో అమెరికాకు ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అప్ఘనిస్తాన్ […]
భద్రాచలం చర్ల మండల కేంద్రంలోని పాత చర్ల మామిడి తోటలో మందు పాతర పేలిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మావోయిస్టు వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ చత్తీస్ఘడ్ సరిహద్దు లోని పలు ప్రాంతాలలో పోస్టర్లు వేశారు మావోయిస్టులు. సమీపంలోకి వచ్చిన ఒక యువకుడు ఆ పోస్టర్లు ని చూస్తున్నాడు. అయితే అక్కడ మావోయిస్టులు వదిలివెళ్లిన మ్యాగజైన్ పేలిపోయింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడగా., బైక్ ధ్వంసమైంది. స్థానికులు బాధితుడు్ని […]
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10 గంటల 15 నిమిషాలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. ఇక మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం తో ప్రయాణికులకు […]
ఉప్పల్ లో ఘరానా మోసాలకు పాల్పడ్డాడు ఓ పాస్టర్. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఆ కీచక పాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే…. ఉప్పల్ లోని గాస్పల్ చర్చి కు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు… కొన్ని టీవీ ఛానళ్లలో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు. చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగదీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్. […]
అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. తాలిబన్లు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయ్. విమానాశ్రయం లోపల తాలిబన్లు…హాయిగా సేద తీరుతున్నారు. నాటో దళాలు ఉపయోగించిన ప్రత్యేక దుస్తులు, ఇతర సామాగ్రి…చిందరవందరగా పడిపోయింది. బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయ్. వీటిలో పనికి వచ్చే వాటిని…తాలిబన్లు ఏరుకుంటున్నారు. యుద్దానికి ఉపయోగించిన హెలికాప్టర్లు పనికిరాకుండా పోయాయ్. జీపులు, ట్రక్కులు…ధ్వంసమయ్యాయి. తాజాగా కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం…తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ […]
పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ ఉప ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జి భవానీపూర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇక షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న మూడు నియోజకవర్గాలకు… సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. కాగా.. మూడు రోజుల క్రితమే ఈ ఎన్నికల షెడ్యూల్ ను […]
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో ఆరెంజ్ అలెర్ట్, ఆ తరువాత 4 రోజులు ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో ములుగు జిల్లా, వెంకటాపురంలో 12 సెంటి మీటర్ల వర్షపాతం నమోదవ్వగా, భద్రాద్రి కొత్తగూడెంలో 13, నల్గొండ జిల్లా చండూరులో 11.5, సిద్దిపేట జిల్లాలో 11.6, మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలో 11, సంగారెడ్డి జిల్లాలో 10.5 సెం.మీ, హైదరాబాద్‌లో 10, రంగారెడ్డిలో 8.8సెంటీ […]