దేశంలో మహిళల, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందా? 2019 కంటే 2020లో అత్యాచార కేసులు పెరిగాయా? తగ్గాయా? ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఏం చెబుతోంది. అత్యాచార కేసుల్లో…ఉత్తరాది రాష్ట్రాలే ముందున్నాయా ? మైనర్లపై దాడులు పెరగడం…ఆందోళన కలిగిస్తోంది.దేశంలో మహిళలపై రోజురోజుకు నేరాలు పెరుగుతూనే ఉన్నాయ్. మృగాళ్ల నుంచి మహిళలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా నిత్యం…సగటున 77 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు NCRB నివేదికలో వెల్లడైంది. దేశంలో ప్రతిరోజు సగటున 80 హత్యలు జరుగుతున్నాయి. ఇందులో భూ వివాదాలు, కుటుంబాల మధ్య గొడవలతో…దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే దేశంలో జరుగుతున్న హత్యల్లో ఎక్కవ శాతం ప్రేమతో ముడిపడి ఉన్నవే. ఓ హత్య జరిగిందంటే దాని వెనుక ప్రేమ వ్యవహారమో, లేక అక్రమ సంబంధాలతో హత్యలు చేస్తున్నారు. ఏదైనా హత్య జరిగితే మొదట పోలీసుల దర్యాప్తు సైతం ఆ కోణంలోనే సాగుతుంది. ఈ విషయాన్నే ఎన్‌సీఆర్‌బీ… ఇటీవల విడుదల చేసిన ‘క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020’ నివేదిక వెల్లడించింది. గతేడాది దేశంలో నమోదైన 29,193 హత్యల్లో 3,031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని వెల్లడించింది.
దేశంలో అక్రమ సంబంధాల హత్యలతో పాటు ప్రేమ పేరుతోనూ దారుణాలు జరిగాయ్. ఈ తరహా హత్యలు 2010-2014 కాలంలో 7-8 శాతం మాత్రమే ఉండేవి. ప్రస్తుతం అది 10-11 శాతానికి పెరిగిందని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. ఈ హత్యల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో నమోదవుతున్న హత్యల్లో 15 శాతం ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవేనని నివేదికలో వెల్లడించింది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా తక్కువగా నమోదవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.