టీటీడీ బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు గళం ఎత్తగా….బీజేపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. మరోవైపు హైకోర్టులో టీటీడీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఏపి ప్రభుత్వం నియమించిన జంబో టీటీడీ పాలకమండలి వ్యవహారంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 81 మందితో పాలకమండలి ఏర్పాటును వివిధ రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖరాశారు. 50 మందికి ఎక్స్ ఆఫిషియోగా అవకాశం ఇచ్చి బోర్డులో […]
ప్రస్తుత జనరేషన్ లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు పేరెంట్స్. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల మరీ క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొంత మంది తల్లిదండ్రులు. ఇటీవలే… తమిళనాడులో ఓ చిన్నారి పట్ల క్రూరంగా వ్యవహరించింది ఓ తల్లి. ఆ ఘటన మరువక ముందే… అలాంటి ఘటనే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. ఓ మూడు సంవత్సరాల చిన్నారి పట్ల.. సొంత తండ్రి దారుణంగా వ్యవహరించాడు. మాట వినడం […]
అమెరికాను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా వైరస్. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాలు ఆందోళన కల్గిస్తోంది. నిత్యం రెండు వేల మందికి పైగా వైరస్ బారినపడి చనిపోతున్నారు. ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియాలో మరణాల రేటు ఎక్కువగా ఉంది.డెల్టా వేరియంట్ కారణంగానే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయ్. కొత్త కేసుల్లో 99శాతం డేల్టా వేరియంట్లేనని అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ చెప్పింది. కరోనా కేసులు పెరగడంతో ఇటీవల నిబంధనలు కఠినతరం చేశారు. ఐతే కొత్త […]
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,35,04,534 కి చేరింది. ఇందులో 3,27,49,574 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 3,09,575 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 252 మంది మృతి […]
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా కూడా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 47,220 కి క్షీణించింది. ఇక , 10 గ్రాముల 22 క్యారెట్ల […]
5-11 ఏళ్ళ లోపు చిన్న పిల్లలకు తమ టీకా సురక్షితమని ప్రకటించింది ఫైజర్. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి అని స్పష్టం చేసింది. తమ టీకా తీసుకున్న చిన్నారులలో యాంటీబాడీస్ ప్రతిస్పందన కనిపిస్తోందని తెలిపింది ఫైజర్. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి ఫైజర్ మరియు బయోఎన్ టెక్ సంస్థలు. క్లినికల్ ట్రయల్స్ లో సమర్థంగా పని చేస్తున్నట్లు నిర్ధారించాయి ఈ […]
నాలుగు దశాబ్దాల పాటు రెండున్నర వేల చిత్రాలకు పోస్టర్స్ డిజైనర్ గా సేవలందించిన ఈశ్వర్ (84) చెన్నయ్‌లో కన్నుమూశారు. యుక్తవయసులోనే చెన్నయ్ చేరిన ఆయన తొలుత తన సీనియర్స్ దగ్గర పోస్టర్స్ డిజైనింగ్ లో శిక్షణ తీసుకుని 1967లో బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’ చిత్రంతో సొంత స్టూడియోను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో విడుదలైన కోడి రామకృష్ణ ‘దేవుళ్ళు’ చిత్రానికి ఆఖరుగా ఈశ్వర్ వర్క్ చేశారు. సినిమా రంగంలో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ఈశ్వర్ పలు […]
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక,ఉప్పల్, హబ్సిగూడ, రామంతపూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అంబర్‌పేట్, రాంనగర్, దోమలగూడ, చిలకలగూడ, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగర శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్‌నగర్‌తోపాటు చార్మీనార్‌లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్‌పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్‌లో ఐదున్నర సెంటీమీటర్లు, సైదాబాద్‌లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్‌లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాల్లో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య ఉత్సవ్ పేరుతో భారీ వాణిజ్య సదస్సును నిర్వహిస్తుంది. ఇవాళ, రేపు విజయవాడలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.ఎగుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను, ఎగుమతుల వాణిజ్య పోర్టల్‌ను, వైఎస్సార్ వన్ వ్యాపార సలహా సేవలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి, కన్నబాబు, పెద్దిరెడ్డి, ,పేర్ని […]
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెత్త స్వీకరణ కేంద్రం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో… స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే… స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపు చేసింది. ఈ ఘటన లో రెండు చెత్త రీసైక్లింగ్ మిషన్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. అగ్నికి […]