ముంబై పై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 14 సీజన్… సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్‌లోని అసలు మజాను చూపించింది. ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై బ్యాట్స్‌మాన్ సౌరభ్ తివారీ చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. 58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన తివారీ ధాటిగా ఆడాడు.
అయితే మిల్నే అవుటైన తర్వాత తివారీకి బ్యాటింగ్ ఛాన్స్ రాకపోవడం.. మరో ఎండ్‌లో చాహర్ తొలి బంతికే డకౌట్ అవడంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రావో 3 వికెట్లు, దీపక్ చాహర్ 2 వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్,శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీశాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్, మొయిన్ అలీ డకౌటయ్యారు. వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయిన చెన్నైని రుతురాజ్ గైక్వాడ్ 88 పరుగులు చేసి ఆదుకున్నాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఇవాళ ఆర్సీబీ, కోల్‌కతా తలపడనున్నాయి.
Also Read
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- Tags
- CSK
- dhoni
- ipl 2021
- mumbai indians
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!