తిరుమల : 25 వ తేది నుంచి ఆన్ లైన్ లో సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. రోజుకి 8 వేల చొప్పున టిక్కెట్లు విడుదల చేస్తూన్నామని.. దర్శనానికి విచ్చేసే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగటివ్ రిపోర్టు చూపించాలని సూచనలు చేశారు. 26 తేదీ నుంచి […]
18 ఏళ్లలోపు చిన్నారుల కోసం తయారైన కొవాగ్జిన్ ప్రయోగాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం సమాచార విశ్లేషణ కొనసాగుతోంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని డీసీజీఐకి వచ్చే వారం అందించనున్నారు. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు సంస్థ అధికారులు తెలిపారు. మరో వైపు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ రెండో దశ ప్రయోగాలు వచ్చే నెల నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని భారత్ బయోటెక్ అధికారులు వెల్లడించారు. […]
సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే నేతలకు గుబులు పుడుతుంది. కానీ ఓటర్లకు మాత్రం పండగే. ముఖ్యంగా మందుబాబులకు. నామినేషన్ వేసింది మొదలు పోలింగ్ వరకు తాగినోడికి తాగినంత. రోజంతా మత్తులోనే. ఎవరిని పలకరించినా మాటలు మత్తు మత్తుగా వస్తాయి. ఊళ్లలో మద్యం ఏరులై పారుతుంది. ఉప ఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ ఎక్కడ చూసినా పండగ వాతావరణమే. ఎన్నికలు ఎప్పుడైనా పెట్టనీ అప్పటి వరకు […]
ఐపీఎల్‌పై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను ప్రసారం చేయకూడదంటూ ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యాచ్‌ల సందర్భంగా చీర్ గాల్స్ డ్యాన్స్ చేస్తారని… అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు. అఫ్ఘానిస్తాన్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం […]
కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది. కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది. […]
లక్షలాది మంది ఇన్వెస్టర్లను నట్టేటముంచిన కార్వి పార్థసారథిని.. బెంగళూరు పోలీసులు కస్టడీకీ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8న శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పార్థసారధిపై.. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 109 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో పార్ధసారధి, కార్వీ సీఈఓ రాజీవ్ రంజన్, సిఎఫ్‌ఓ కృష్ణహరిపై కేసులు నమోదయ్యాయి.ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని బెంగుళూరు సీసీబీ పోలీసులు.. కోర్టును కోరారు. కస్టడీకి అనుమతించడంతో చంచల్ గూడ జైలు నుంచి నిందితులను […]
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి.ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి తోడు దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశముందని చెప్పింది. ఇక బెంగాల్ పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో పలుచోట్ల జల్లులు కురుస్తాయని అధికారులు […]
ఢిల్లీలోని MiM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై హిందూ సేన దాడి చేసింది. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న ఇంటికి వెళ్లిన హిందూసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. నేమ్ ప్లేట్‌ను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని ఆరురుగురిని అరెస్టు చేసి తరలించారు. మరోవైపు జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అసద్. తన నివాసంపై దాడి జరగడం ఇది మూడో సారి అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో […]
విజయవాడ : త్వరలో జరగనున్న కాటన్ ప్రొక్యూర్మెంట్ విధి విధానాలపై ఉన్నతాధికారులు , సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులతో మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి ప్రత్తి కొనుగోలు ప్రక్రియ మొదలెట్టేందుకు చర్యలు తీసుకుకోవాలని సీఎం ఆదేశించారని ఈ సందర్బంగా పేర్కొన్నారు మంత్రి కన్నబాబు. సీఎం ఆప్ ద్వారా రాష్ట్రంలోని 50 ఎఎంసిలు , 73 జిన్నింగ్ మిల్స్ సీసీఐ ద్వారా కాటన్ ప్రొక్యూర్మెంట్ చేయనున్నామని.. దేశంలో […]
ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేశారు. అధికారపార్టీలో చర్చగా మారారు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు. వర్గపోరు మళ్లీ రాజుకుని.. సొంత పార్టీలోనే వైరిపక్షాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారెవరో.. ఆ రగడేంటో ఇప్పుడు చూద్దాం. ఎంపీ భరత్ వర్సెస్ ఎమ్మెల్యే రాజా! తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు మరోసారి చర్చగా మారాయి. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో ఓ ఘటన యువనేతల మధ్య ఉన్న ఆధిపత్య […]