చంద్రబాబు కంచుకోట కుప్పం కోటలు బీటలు వారుతున్నాయా? మెజార్టీ తగ్గడం, పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి అందుకు సంకేతాలా? టీడీపీ వెనకబాటు ఇప్పటి వరకేనా.. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటుందా? ఏం జరుగుతోంది కుప్పంలో…! కుప్పం బాబు కోటకు బీటలు వారుతున్నాయా?నాటి పంచాయతీ ఎన్నికల్లో 89లో టీడీపీకి దక్కింది 14..! కుప్పం… చంద్రబాబు సొంత నియోజకవర్గం. అక్కడ నుంచి ఆయన ఏడుసార్లు వరసగా గెలుస్తున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు. అంటే… అక్కడ […]
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే… వైఎస్ షర్మిల నిరుద్యోగ-నిరాహార దీక్షను అడ్డుకున్న పోలీసులు…అనంతరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత షర్మిలను మేడిపల్లి పీఎస్‌కు తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ నేపథ్యం లో తీవ్ర ఉద్రికత్తత నెలకొంది. వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. చివరికి వైఎస్‌ఆర్టీపీ కార్యకర్తలను క్లియర్ చేసి…. వైఎస్ షర్మిల ను మేడిపల్లి పీఎస్ కు తరలించారు పోలీసులు. ఈ ఘటన పై […]
అమరావతి : విజయవాడలో వాణిజ్య ఉత్సవ్ సదస్సు నేడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్ ను విడుదల చేశారు సీఎం జగన్. ఎగుమతులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ-పోర్టర్ ప్రారంభించారు సీఎం జగన్. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఏపీ క్రమంగా ఎగుమతుల వృద్ధి సాధిస్తోందని… 2021లో 19.4 శాతం మేర పెరిగాయన్నారు. ఆక్వా ఉత్పత్తులు,బోట్లు షిప్ నిర్మాణం , ఫార్మా తదితర రంగాల్లో ఏపీ గణనీయమైన ఎగుమతులు సాధిస్తోందని… 68 మెగా […]
హుజూరాబాద్ బై పోల్ ఫీవర్ రోజు రోజుకు పెరుగుతోంది. ఎలక్షన్ డిలే అయినా పార్టీల ప్రచార హోరు ఆగలేదు. పైగా జోరు పెరిగింది. గల్లీ గల్లీలో నేతలు సందడి చేస్తున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. చాలా రోజుల క్రితమే అభ్యర్థిని ప్రకటించిన టీఆర్‌ఎస్.. ప్రచారంపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఓపెన్ సీక్రెట్. నూటికి 99 శాతం ఈటలే. ఆ ఒక్క శాతం తేడా వస్తే ఆయన భార్య […]
వచ్చే నెల తమ జట్ల పాక్ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ECB. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి […]
భారత ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 24న జో బైడెన్, నరేంద్రమోదీ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుందని వైట్ హౌస్ ప్రకటించింది. ఐతే… ప్రధాని మోదీ ఈ వారంలో అమెరికా వెళ్లనున్నారు. జో బైడెన్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసాక.. మోదీ అమెరికా వెళ్లడం ఇదే తొలిసారి. వీరు గతంలో వర్చువల్ ద్వారా జరిగిన… క్వాడ్ సమ్మిట్ , క్లైమేట్ చేంజ్ సమ్మిట్, జీ-7 […]
పునర్జన్మల మీద ఎవరి నమ్మకం వారిది. సైన్స్ కు అందని రహస్యాలు అప్పుడప్పుడు సాక్షాత్కారం అవుతాయి. విశాఖలో అమ్మకు దూరమైన ఇద్దరు చిన్నారులు….సరిగ్గా వాళ్ళు చనిపోయిన రోజే…అదే సమయంలోనే జన్మించారు. మళ్ళీ తమ పిల్లలే తిరిగి పుట్టారని తల్లిదండ్రులు సంతో షంలో వుంటే.. వైద్యులకు మాత్రం ఇది మిరాకిల్ గానే కనిపిస్తోంది. సెప్టెంబరు 15, 2019.. గోదావరి నదీ ప్రమాదాల్లో అతిపెద్ద విషాదం. రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరిన వశిష్ఠ బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం […]
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. […]
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కన్పిస్తోంది. గత కొన్నిరోజులుగా అతడి సారథ్యంలో ఇండియన్ టీం ప్రతిష్టాత్మమైన లీగ్ మ్యాచుల్లో తలపడుతోంది. ఈ నేపథ్యంలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువగా విన్పిస్తోంది. అతడిని టెస్టు క్రికెట్ టీంకు కెప్టెన్ గా పరిమితంచేసి పరిమిత ఓవర్ల టీంకు రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. బీసీసీఐ సైతం టీంఇండియాకు ఇద్దరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. త్వరలోనే ఇది అమల్లోకి […]