స్యూల్స్ రీ ఓపెన్ పై వరల్డ్ బ్యాంక్ సంచలన ప్రకటన !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు బయటపడుతున్నాయి. ఇంకా చాలా దేశాల్లో భయంకర స్థాయిలోనే కరోనా ఉంది. అయినప్పటికీ.. స్కూల్స్ తెరవాల్సిందే అంటోంది వరల్డ్ బ్యాంక్. చిన్నారులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు తక్కువేనని తన తాజా నివేదికలో తెలిపింది. టీకాల పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది. వ్యాక్సిన్ రూపొందించక ముందే చాలాదేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ.. పరిస్థితులేమీ విషమించలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.
వైరస్ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని, అదే సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం వల్ల పిల్లలు, సిబ్బంది మధ్య వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రీ-పైమరీ, ప్రైమరీ పాఠశాలల్లోనూ వైరస్ సంక్రమణ తక్కువగానే ఉందని తెలిపింది. పాఠశాల సిబ్బందికి మాత్రమే తోటి సిబ్బంది నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని.. పిల్లల నుంచి కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల్లోనూ స్కూల్స్ ప్రారంభించారు.
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్తో ఢీకొట్టిన డ్రైవర్కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
అయితే తెలంగాణలో విద్యార్థులను బడులకు రావాలంటూ బలవంతం చేయవద్దని.. ఆన్‌లైన్‌లోనూ క్లాసులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో… అలాగే క్లాసులు జరుగుతున్నాయి. అయితే, పాఠశాలలను మూత వేయడం వల్ల వైరస్ సంక్రమణ ముప్పును మాత్రమే తొలగిస్తుందని… కానీ, దీనివల్ల పిల్లల అభ్యాసన, మానసిక ఆరోగ్యంతో పాటు వారి పూర్తి అభివృద్ధికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. స్కూళ్లు తెరిస్తే వచ్చే ముప్పు కంటే అవి తెరవకపోవడం వల్ల కలిగే నష్టాలే అధిక రెట్లు ఎక్కువని స్పష్టం చేసింది. అందువల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వ్యూహాలను అమలు చేస్తూ విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.
తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!