కరోనా నుంచి కోలుకున్న వారికి కొత్త సమస్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తగ్గిందని ప్రశాంతంగా ఉందాం అనుకునేలోపే పోస్ట్ కరోనా సమస్యలు మొదలయ్యాయి. శరీరంలోని అన్ని అవయవాలపైనా కరోనా తన ప్రభావం చూపిస్తుంది. తాజాగా నిమ్స్ వైద్యుల పరిశోధనలో జీర్ణ కోశ వ్యవస్థపై కరోనా ప్రభావం ఉందని తేలింది. చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారుతోందని నిమ్స్ వైద్య బృందం అంటోంది.
దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఐతే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అంతా బాగానే ఉందని అనుకుంటే పొరపాటే. కరోనా తర్వాత ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి. పలురకాల వ్యాధులు వేధిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధిని డాక్టర్లు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో పేగుల్లో కుళ్లిపోయి.. గ్యాంగ్రీన్ ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఒకటా.. రెండా.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల తీవ్రమైన కడుపునొప్పితో కొందరు బాధితులు నిమ్స్‌లో చేరారు. పరీక్షలు చేసిన తర్వాత బాధితుల చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టిందని.. అది ముదిరి గ్యాంగ్రేన్‌గా మారిందని డాక్టర్లు గుర్తించారు. అంటే కరోనా బాధితుల పేగులు కుళ్లిపోయాయి. ఇద్దరు బాధితుల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పేగులను తొలగించారు. కిడ్నీలు కూడా పాడవడంతో డయాలిసిస్ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. గ్యాంగ్రీన్ కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించారు.
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
తీవ్రమైన కడుపు నొప్పి, దానితో పాటు వాంతులు, నీళ్ల విరేచనాలు, నల్లరంగులో మలం, మూత్రంలో రక్తపు చారలు గ్యాంగ్రీన్ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదమంటున్నారు. మొత్తానికి కరోనా వచ్చినా, వచ్చి తగ్గినా చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!