తెలంగాణ రాష్ట్రంలో.. బస్తీ దవాఖానాల తరహాలోనే గ్రామ దవాఖానలు కూడా త్వరలోనే రాబోతున్నాయని..దీని కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 లక్షలు ఆదాయం ఉండేట్టు చేశామని.. గ్రామ పంచాయతీ లు ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నాయని వెల్లడించారు. 12,769 గ్రామాల్లో 9 వేల కార్యదర్శుల పోస్టులు కొత్తవి వేశామని.. అన్ని పోస్టులకు ప్రమోషన్ కూడా ఇచ్చేశామని తెలిపారు. […]
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి జాతీయ కార్యవర్గం లో కొత్త వారికి చోటు దక్కింది. అంతేకాదు తెలంగాణ నుండి ఎక్కువ మంది కి అవకాశం దక్కింది. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏకంగా నలుగురికి చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఇద్దరికి అవకాశం దక్కింది. కార్యవర్గ సభ్యులు గా కిషన్ రెడ్డి, గరిక పాటి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట […]
ఐపీఎల్ 2021లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్… మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేయనుంది చెన్నై. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, MS […]
విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయ్. ప్రతీఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఐతే…కోవిడ్ పరిస్థితులతో…ఆంక్షల నడుమ ఏర్పాట్లు చేశారు. రోజుకు గరిష్టంగా 10 వేల మందికి దర్శనం దక్కేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం మాదిరిగా టైం స్లాట్ ప్రకారముగా రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. భక్తులు ఆన్‌లైన్ ద్వారా టైం స్లాట్ ప్రకారం వెబ్‌సైట్‌లోకి వెళ్లి దర్శనం టిక్కెట్లు బుక్ […]
బద్వేల్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నిక ఉత్కంఠగా జరుగుతుందని అంతా భావించారు. అయితే అందరీ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీకి ఇక్కడ గెలుపు నల్లేరుపై నడకలా మారింది. అయితే వైసీపీ మెజార్టీపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 44వేల ఓట్ల మెజార్టీరాగా దానిని అధిగమించడమే లక్ష్యంగా ఆపార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి. గత […]
ప్రస్తుతం బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా నడుస్తుంది. మరో మాజీ క్రికెటర్ బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నట్లు బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. యువరాజ్ సింగ్ నిజజీవితాన్ని ఆధారంగా ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ సిద్ధమయైనట్లు తెలుస్తోంది. దీనిపై యువరాజ్‌తో సంప్రదింపులు కూడా జరిపాడని సమాచారం. కరణ్ ప్రతిపాదనకు యువీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని బీటౌన్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే యువీ ప్రతిపాదించిన ఇద్దరు స్టార్ హీరోలను […]
హెటిరో ఫార్మా సంస్థలపై అదాయపు పన్ను శాఖ దాడులు…రెండో రోజు కొనసాగుతున్నాయ్. నిన్న ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోవిడ్ సమయంలో కంపెనీ లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సంస్థ డైరెక్టర్లు జొన్నల సంబిరెడ్డి, నరసింహారెడ్డి, బండి వంశీకృష్ణ, బండి పార్థసారథిరెడ్డితో పాటు భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సనత్‌నగర్‌లోని హెటిరో హెడ్ ఆఫీస్‌తో పాటు వైజాగ్ నక్కపల్లి మండలంలో ఉన్న హెటిరో కార్యాలయంలోనూ…ఐటీ అధికారులు తనిఖీలు […]
దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు, రూల్స్ తీసుకువచ్చినా.. రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. అతి వేగం, మద్యం సేవించి.. వాహనాలు నడపడం కారణంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలో బస్సు,ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయ్. ఈప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు.మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయ్. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని […]
దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర […]
ఇవాళ్టి నుంచి 15వ తేది వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వాహనసేవలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు మరియు రాత్రి 7 గంటలకు నిర్వహిస్తామని.. గరుడ వాహన సేవను రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూన్నామని… ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహరథం బదులుగా సర్వభూపాల వాహన సేవను నిర్వహిస్తామని చెప్పారు. చక్రస్నాన కార్యక్రమాని ఆలయంలోని అద్దాల మహల్ […]