12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని గుర్తించే లక్ష్యంతోనే ఈ లేఖ రాసినట్లు తెలిపారు.
నీట్‌కు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందడంలో పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు స్టాలిన్. విద్యారంగంపై రాష్ట్రాల అధికారాలను పునరుద్ధరించుకునేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ఇందుకోసం నీట్‌కు ప్రత్యామ్నాయంగా వైద్యవిద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి ఏకే రాజన్ కమిటీ నివేదికను తాను రాసిన లేఖకు జతచేశారు. నీట్ కాకుండా, అందరు విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రవేశ విధానం, అమలు సాధ్యాసాధ్యాలు, న్యాయపరమైన అంశాలను సూచించాలని తమిళనాడు ప్రభుత్వం ఏకే రాజన్ కమిటీని కోరింది. కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు వైద్యవిద్య ప్రవేశ పరీక్షల చట్టానికి తమిళనాడు అసెంబ్లీ ఈమధ్యే ఆమోదం తెలిపింది.
Also Read
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
-
Aakasam Lo Oka Tara Teaser: ఇంటి పని, వంట పనులు నేర్పకుండా బళ్ళు బలాదూర్‌లని తిరగనిస్తే ఇలానే తయారవుతారు
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
ట్రెండింగ్
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!