శంషాబాద్ మండలం పరిధిలోని శ్రీరామనగరంలోని జీవా ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారితో కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని జమ్మి మొక్కను నాటారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ.. “వృక్షో రక్షతి రక్షితా:” అన్నారు మన పెద్దలు. కానీ, ఆధునిక మానవుడు చెట్లను కొట్టేస్తూ..కొండలను తవ్వేస్తూ ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడు. ఈ తరుణంలో మన భారతీయ సంస్కృతి భూమి గురించి, ప్రకృతి గురించి, […]
తెలంగాణ కరోనా కేసులు రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40, 354 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 183 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందాడు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,070 కి చేరగా.. రికవరీ కేసులు 6,59,942 కి పెరిగాయి.. ఇక, […]
ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్ బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది కేకేఆర్ జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ […]
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వంలో మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠకు గురిచేస్తుంది. […]
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘ పెళ్లి సందడి’ సినిమాతో నటుడుగా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్, శ్రీ లీల ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 15 వ తేదీన విడుదల కానుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ‘శతమానంభవతి’తోనే రాఘవేంద్రరావును పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేయాలనుకున్నామని, […]
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మహారంజుగా జరిగాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియలో నటి హేమ, శివబాలాజీ చెయ్యి కొరకడమే చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం మీడియాలో ప్రసారం కానంత వరకూ ‘అలాంటిదేమీ లేద’ని, ఇదంతా ‘తమ ఎక్స్ గాడు (నరేష్) చేస్తున్న అతి’ అని చెప్పిన హేమ… వీడియో బయటకు రాగానే మొదట మౌనం దాల్చింది. శివబాలాజీ చేయిని హేమ కొరడం వెనుక ఆకతాయితనం కాదు ఓ ప్రధాన కారణమే ఉంది. ‘మా’ సభ్యులు ఓటు […]
టెన్త్ పరీక్షా పేర్లను కుదించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే.. ఈ సారి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3 […]
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో…ప్రచారం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. సభలు, సమావేశాలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయ్. ఇంటింటికి వెళ్లి…ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఆసక్తికర విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నికలో 19 నామినేషన్లు తిరస్కరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు. ఈటల పేర్లతో ఉన్న ముగ్గురి నామినేషన్లు తిరస్కరించారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో రాజేందర్ పేర్లతో… మొత్తం నలుగురు అభ్యర్థులు […]
బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం టాక్ షో చేయబోతున్నాడు బాలయ్య. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో నవంబరులో ఆరంభం కానుంది. దాదాపు 8 ఎపిసోడ్స్ తో ఈ షోను ఆరంభించబోతున్నారు. గంట పాటు ఉండే ఈ షో బాలకృష్ణతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయింది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ […]