అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా […]
కరీంనగర్ జిల్లా : జమ్మికుంటలో కవాతు చేయాలని మహిళలు కోరుతున్నారని… తప్పకుండా త్వరలోనే చేస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. జమ్మికుంట పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తనకు సపోర్ట్ గా ఉన్న నాయకులను పట్టండని కెసిఆర్ ప్రగతి భవన్ లో ప్లాన్ వేస్తే.. హరీశ్ రావు అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు ఉన్న నాయకులు రేపు తనతో ఉండడం లేదని […]
నల్గొండ : మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా…విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా ? అని నిలదీశారు వైఎస్ షర్మిల. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా…?ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు. ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ […]
ముంబై క్రూయీజ్ డ్రగ్స్ పార్టీ కేసులో… బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి చుక్కెదురైంది. అతని బెయిల్ పిటిషన్‌ను కోర్టు మూడో సారి తిరస్కరించింది. శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలన్న ఎన్సీబీ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది న్యాయస్థానం. స్టేట్మెంట్ సమర్పించాలని ఆదేశించింది.డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారూఖ్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు.. మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో అతను మరో మూడ్రోజులు జైల్లోనే ఉండనున్నాడు. నార్కొటిక్స్ కంట్రోల్ […]
”మా” అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తాజాగా జబర్దస్త్ కామెడీ షో యాంకర్, ప్రముఖ నటీ అనసూయ ఆసక్తి కర ట్వీట్ చేసింది. నిన్న రాత్రి తాను భారీ మెజారిటీ తో గెలిచానని చెప్పారని… కానీ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో మాత్రం తాను ఓడిపోయానని ప్రకటించారు. అసలు రాత్రికి రాత్రే ఫలితాల్లో ఇంతలా మార్పు జరిగిందా ? అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎన్నికల నిబంధనలను విరుద్ధంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ […]
ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ మ్యాచ్ బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న సంగతి తెలిసిందే. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి… కేవలం 138 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లి 39 పరుగులు మరియు పడిక్కల్ 21 పరుగులు మినహా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు […]
దేశాన్ని అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్సే. ఈ రికార్డును దేశంలోని ఏ రాజకీయ పార్టీ బ్రేక్ చేసే అవకాశం కనుచూపు మేరల్లో కన్పించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీ గడిచిన దశాబ్దకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్రంలో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అధికారానికి దూరమవడంతో ఆ ప్రభావం క్రమంగా రాష్ట్రాలపై పడుతోంది. దీంతో క్రమంగా ఆయా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ క్రమంగా పట్టును కోల్పోవాల్సి వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే […]
హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో రూ. 142 కోట్ల నగదు సీజ్ అయింది. అలాగే… రూ. 550 కోట్ల బ్లాక్ మనీని గుర్తించారు అధికారులు. 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్ధల్లో ఐటీ దాడులు జరిగాయి. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును దాచిపెట్టారని.. బీరువాల్లో రూ. 500 నోట్ల కట్టలేనని ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను సీజ్ చేసిన అధికారులు.. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో […]
కొన్నేళ్ల నుంచి ఎయిర్ ఇండియా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సహజంగానే అది అందులో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. జీతాల్లో కోత…చెల్లింపులో ఆలస్యం..ఉద్యోగుల తొలగింపు వంటివి ఎలాగూ ఉంటాయి. వేల కోట్ల అప్పుల భారంతో ఉన్న సంస్థకు ప్రభుత్వం ఇక ఏమాత్రం నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఎయిరిండియా ఉద్యోగులకు ఎప్పుడో అర్థమైంది. దాంతో కొంత కాలంగా వారు భవిష్యత్‌పై బెంగపెట్టుకున్నారు. లక్ష కోట్ల మేర రుణ భారంతో కుంగిపోయిన ఉన్న ఎయిర్ ఇండియా అమ్మకానికి 2018లో […]
కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపిస్తున్నారు శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఆయన డాన్స్ చూశాం. ఇప్పుడు ఆయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధర్మపురి’. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వజగత్. ఆ ఊరి ఘడి లో సర్పంచ్ దగ్గర […]