విజయవాడ : శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు శ్రీ లీల హీరో హీరోయిన్లు గా పెళ్లి సందD సినిమా దసరా కానుకగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని విజయ వంతంగా నడుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల వివాదంలో చిక్కుకుంది. శ్రీ లీల తన కూతురే కాదని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో […]
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కళాకారుల కుటుంబంలో జన్మించిన అనిరుధ్ రవిచందర్ బాల్యంలోనే బాణీలు కట్టి భళా అనిపించాడు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి చిత్రం ‘3’లో “వై దిస్ కొలవరి ఢీ…” అంటూ అనిరుధ్ స్వరపరచిన పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ తరువాత అనేక చిత్రాలలో యువతను విశేషంగా అలరించే స్వరకల్పన చేశాడు అనిరుధ్. అనిరుధ్ రవిచందర్ 1990 అక్టోబర్ 16న జన్మించాడు. […]
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆ జిల్లాల నాయకుల తీరే వేరా? పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాల్లో నేతలు ఎందుకు స్తబ్దుగా ఉన్నారు? పార్టీ కార్యక్రమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న జిల్లాలోనూ అదే పరిస్థితి ఉందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీసీసీ కార్యక్రమాలకు నో ఎంట్రీ..! పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండిపోయారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీకి బలమైన నాయకత్వమే […]
ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అతని అభిమానులు ‘మహా సముద్రం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం ‘జబర్దస్త్’ మూవీలో నటించిన సిద్ధార్థ్, మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… అతనిది సమ్ థింగ్ స్పెషల్ పాత్రే అయి ఉంటుందని ఊహించుకున్నారు. వీటికంటే ప్రధానంగా ‘ఆర్. ఎక్స్. 100’ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా, కాదని డైరెక్టర్ అజయ్ భూపతి […]
పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్‌లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. 2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా? బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి. […]
హుజురాబాద్‌లో అట్టహాస ప్రచారానికి EC ఆంక్షలు అడ్డంకిగా మారాయి. దీంతో పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. హుజురాబాద్‌లో కాలు పెట్టకుండానే ఆ ప్రభావం ఉపఎన్నికపై పడేలా వ్యూహ రచనలో పడ్డాయట. వరస మీటింగ్‌లతో బైఎలక్షన్‌లో ఊపు తీసుకొచ్చే పనిలో ఉన్నాయట. ఈ విషయంలో అధికారపార్టీ ఆలోచన ఏంటి? హుజురాబాద్‌లో ప్రచార ఊపు తీసుకొచ్చేలా టీఆర్ఎస్ ప్లీనరీ? తెలంగాణలో గతంలో జరిగిన ఉపఎన్నికల ప్రచారానికి భిన్నంగా సాగుతోంది హుజురాబాద్ బైఎలక్షన్. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాయి కానీ.. భారీ […]
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టినెలకొంది. ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉపఎన్నిక మారిపోవడంతో ఫలితం ఎలా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలంతా నువ్వా.. నేనా? అన్నట్లుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఇదే అదనుగా ఎన్నికల అధికారులు సైతం దూకుడుగా వెళుతున్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 13రోజుల్లోనే ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులపై 40కిపైగా కేసులు నమోదు చేశారు. దీంతో హుజూరాబాద్ బైపోల్ కేసుల […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ లో తిష్టవేసి తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పక్కచూపులు చూస్తున్నాయి. నేతలంతా హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై ఫోకస్ పెడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల […]
‘మా’ ఎన్నికలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ‘మా’లో రచ్చ నెలకొంది. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్(మా)కు నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచే రచ్చ పీక్స్ కు చేరుకుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చాక అందరూ కలిసిపోతారని భావించారు. అలాంటిదేమీ జరుగకపోగా ‘మా’లో చీలీకను కారణమవుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో అసలు ‘మా’లో ఎం జరుగుతోంది. ‘మా’ అసోసియేషన్ రెండు గ్రూపులుగా విడిపోయిందా? అన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది. […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల మూడ్ లోకి వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని కొట్టారు. ఈ వ్యూహం నాడు సత్ఫలితాలు ఇవ్వడంతో ఏపీలోనూ ఇదే ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు ముందుగానే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. […]