శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ల మధ్య సవాళ్లు కొనసాగుతుంది. అయితే, కమ్మకోత్తుర్ లో రూరల్ సీఐ టీడీపీ నాయకులను బూతులు తిట్టి కొట్టడంతో తీవ్ర వివాదం అవుతుంది. ఎందుకు కార్యకర్తలను కొట్టారని సీఐకి బొజ్జల ఫోన్ చేశాడు. ఒక ఇన్ చార్జ్ గా ఉన్న నన్ను కనీస గౌరవంగా లేకుండా బూతులు తిట్టాడు అంటూ ఆయన ఆరోపించారు. ఏం చేసుకుంటావో చేసుకో.. దమ్ముంటే స్టేషన్ కు రావాలంటూ సుధీర్ కు సీఐ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. దీంతో సీఐ మాటలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి ఆయన మద్దతుదారులు, టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందుకు ధర్నాకు దిగారు. శ్రీకాళహస్తి రూరల్ సీఐకు వ్యతిరేకంగా నినాదాలు టీడీపీ-జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రూరల్ సీఐ అజయ్ కుమార్ వెంటనే సస్పెండ్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ దగ్గరే టెంట్ వేసుకుని బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు టీడీపీ, జనసేన కార్యకర్తలు కూర్చున్నారు.