ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. వీటి విలువ రూ.2,500 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జగన్ పేదవాడు ఎందుకు అవుతాడు.. ఇప్పుడు పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు కరువు ప్రాంతాలు చూస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో కరువు విలయతాండవం చేస్తే రైతులకు ఏమి చేశారు అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు స్టీరింగ్ కమిటీ పేరుతో ఏ ముఖం పెట్టుకొని రైతుల వద్దకు వస్తారు.. టీడీపీ హయాంలో రైతు రథం.. నీరు చెట్టు పేరుతో దోచుకున్నారు.
తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో మంత్రి కేటీఆర్ గంగవ్వ టీమ్తో సందడి చేశారు. ఆ ప్రోగ్రాంలో ఏదో టీవీ ఇంటర్వ్యూ లాగా కాకుండా.. నాటుకోడి కూర చేసుకొని పంట పొలాల మధ్యలో మంత్రితో దావత్ చేసి మరీ సరదాగా గడిపారు.
జలవనరుల సమర్ధ వినియోగం, భవిష్యత్ సవాళ్లపై కీలకంగా చర్చిస్తున్న ఐసీఐడీ ప్లీనరీ సమావేశం జరిగింది. నీటి యాజమాన్య నిర్వహణ కోసం ప్రపంచ స్దాయి సాంకేతికతలపై ఐసీఐడీ తీర్మానం చేసింది.
ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యనించారు.
జగన్ పేరు చెప్తేనే ఓ శక్తి వస్తుంది అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన సీఎం జగన్.. చంద్రబాబు అంటే అబద్దం...చంద్రబాబు అంటే మోసం.. అబద్ధాలకు, మోసాలకు చెక్ పెట్టిన నాయకుడు జగన్.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.. నాలుగు నెలలో ఎన్నికలు రాబోతున్నాయి.. ధన వంతులు - పేదావాడికీ.. దొపిడీకీ - నిజాయితీ మధ్య వార్ జరుగుతోంది.. ప్రజలు చాలా గ్రహించాలి.. మళ్లీ టీడీపీ దోపిడీ పార్టీ ని రాకుండా చూడాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
సామాజిక యాత్ర పై వాడ వాడలా చర్చ జరుగుతుంది అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఏపీ సీఎం చేసిన అభివృద్ధి,సంక్షేమం పై చర్చ జరుగుతుంది.. పేదరికాన్ని తొలగించాలన్న నినాదంతో ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారు.