ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా కొనసాగుతున్న భూ కబ్జాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. వీలైనంత తొందరలో విచారణ దర్యాప్తు పూర్తి చేస్తాని తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన భూకబ్జాలపై ఎస్పీ మలికా గార్గ్తో కలిసి చర్చించారు.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
ఈ నెల 21 నుంచి కుల గణన ప్రారంభం అవుతుంది అని సమాచార శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుంది.. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ పాతది అయిపోయింది.. ఇంకా ఏదైనా కొత్తది తెచ్చుకోవాల్సిందే.. చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న బ్యారేజ్.. 35 వేల కోట్లతో ఉన్న వ్యయంను లక్ష కోట్లకు నిర్మాణం చేశారు అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. కాళేశ్వరంతో లక్ష ఎకరాల పంటకు నీరందిస్తామని కేసీఆర్ తో పాటు మంత్రులు చెప్పారు.. డ్యాంకు ఏమైనా జరిగితే కట్టిన సంస్థనే బాధ్యత భరిస్తుంది అని గతంలో తెలిపారు.
మాజీ మంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ మొదటి రోజు మీడియా సమావేశం నిర్వహించి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 300 కోట్లు దాన కుంభకోణం చేశాడు అని ఆరోపించారు. కోళ్ళ దాన కుంభకోణంలో 3 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందన్నారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం.. సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలి.. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు , అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు ఎందుకు చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చేసే వాళ్ళం అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి ఉండే వాళ్ళం.. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు అన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..
వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అ మెగా టోర్నమెంట్ లో భాగంగా నేడు వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో 5 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగుల మాత్రమే ఇచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టాడు.