హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చంద్రబాబు అనారోగ్యంతో పాటు మధ్యంతర బెయిల్ పై పవన్ పరామర్శించారు. ఇక, జనసేనాని వెంట జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉండగా.. బాబు వెనక టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉన్నారు. అయితే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
Read Also: Bigg Boss 7 Telugu: శోభకు షాక్.. కెప్టెన్ అయిన ఆనందం కూడా లేకుండా చేశావ్ గా నాగ్ మామ!
ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొన వచ్చో.. లేదోననే అంశంపై న్యాయ నిపుణులతో టీడీపీ సంప్రదింపులు చేస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి సాంకేతిక ఇబ్బంది లేదనుకుంటే.. చంద్రబాబు ఆరోగ్యం కుదుటపడ్డాక ఉమ్మడి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక, తెలంగాణ, ఏపీ తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో టీడీపీ- జనసేన చేట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. అయితే, 10 అంశాలతో మినీ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించాలని టీడీపీ- జనసేన పార్టీలు యోచిస్తున్నాయి.
Read Also: Continental Hospitals : కాంటినెంటల్ హాస్పిటల్స్ ఖాతాలో మరో అవార్డు
అలాగే, క్షేత్ర స్థాయిలో టీడీపీ- జనసేన పార్టీల లీడర్లు, కేడర్ ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైనా ఈ సమావేశంలో చంద్రబాబు- పవన్ కళ్యాణ్ చర్చించారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కరువు, ధరల పెరుగుదల, కరెంట్ ఛార్జీల పెంపు, మద్యం, ఇసుక కుంభకోణాల వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి పోరాటాలు చేపట్టాలని టీడీపీ- జనసేన పార్టీలు చూస్తున్నాయి.