సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. సామాజిక యాత్రకు ఎన్నికలతో సంబంధం లేదు.. సామాజిక విప్లవానికి ప్రతీక ఈ యాత్ర అని ఆయన పేర్కొన్నారు.
వెనుక బడిన వర్గాలకు నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీలో సుపరిపాలన జరగకుండా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది.. తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు..
చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనారోగ్యంతో హస్పటల్ లో చేరారు. నిన్నటి నుంచి దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ఆయన వైద్య పరీక్షల్లో వైరల్ ఫీవర్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు.
ఏపీలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గబాటి పురంధరేశ్వరి వర్సెస్ వైసీపీ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న డైలాగ్ వార్ నడుస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని పురంధరేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ పురంధేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!? అని ప్రశ్నించారు.
ఈ నెల 7న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆలోచిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పర్యటిస్తున్నానని అతడు చెప్పారు. 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.