తెలుగు రాష్ట్రాల్లో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌కు బాగా పాపులారిటీ ఉంది. చిన్న చిన్న వీడియోలతో ఈ ఛానల్ ను స్టార్ట్ చేసి.. ప్రస్తుతం సినిమా హీరోలతో ప్రమోషన్ వీడియోలు చేసే రేంజ్‌కు ఈ ఛానల్ వెళ్లింది. ముఖ్యంగా యూట్యూబ్ టీమ్ లో గంగవ్వ బాగా ఫేమస్ కావడంతో పాటు అనిల్, అంజిమామ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక, ప్రస్తుతం ‘మై విలేజ్ షో’ గంగవ్వ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తుంది. గంగవ్వ ఇప్పటికే ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసింది.
Read Also: Onion Price: వారికి ఉల్లిగడ్డ కేజీ రూ.25.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అయితే, తాజాగా.. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ లో మంత్రి కేటీఆర్ గంగవ్వ టీమ్‌తో సందడి చేశారు. ఆ ప్రోగ్రాంలో ఏదో టీవీ ఇంటర్వ్యూ లాగా కాకుండా.. నాటుకోడి కూర చేసుకొని పంట పొలాల మధ్యలో మంత్రితో దావత్ చేసి మరీ సరదాగా గడిపారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వెరైటీగా ప్రచారం చేయడంలో మంత్రి కేటీఆర్‌ను మించినోడు లేడని కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతునే.. గంగవ్వతో టీమ్ తో బగారా రైస్ తో పాటు నాటు కోడి కూర కూడా వండి తినేశారు.