నారాయణఖేడ్ కాంగ్రెస్ టికెట్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే సురేశ్ షెట్కార్కు టికెట్ను ఖరారు చేసిన కాంగ్రెస్.. తాజాగా సంజీవ్రెడ్డికి ఇస్తున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతతృప్తుల బుజ్జగింపులు దాదాపు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి టికెట్ ఆశించిన భంగపడ్డ 20 మంది నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసి మాట్లడుతున్నారు.
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు.
బీహార్లోని ఓ గ్రామంలో ఎంత ప్రయత్నించినా అక్కడి అబ్బాయిలకు మ్యారేజ్ లు జరగటం లేదట. జముయి జిల్లా సదర్ ప్రధాన కార్యాలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బరుఅట్టా విలేజ్ లో అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా కష్టపడుతున్నారంట. ఈ ఊరి యువకులు ఉద్యోగాల కంటే పెళ్లి చేసుకోవడానికే ఎక్కువగా కష్టపడుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు.
రెండో రోజూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 30 ప్రాంతాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి.
సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్ ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు.