కామారెడ్డిలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనున్నారు.
కాచిగూడ లింగంపల్లి రాఘవేంద్ర స్వామి ఆలయంలో పూజ నిర్వహించిన అనంతరం కార్యకర్తలు, నాయకులతో కలిసి అంబర్ పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాలేర్ వెంకటేష్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ తీసుకుంది.
దేశంలో చట్ట సభల్లో సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను తొందరగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్వర్వులు ఇచ్చింది.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేయడానికి మధిర రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తుల, అభిమానులతో కలిసి ఆయన వెళ్లి నామినేషన్ వేశారు